Beauty Tips: ఈ ఆకుపచ్చ ఆకుతో తక్షణ మెరుపు.. అందమైన చర్మం కోసం ఇలా చేయండి..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Beauty Tips: ఈ ఆకుపచ్చ ఆకుతో తక్షణ మెరుపు.. అందమైన చర్మం కోసం ఇలా చేయండి..!

8/30/2023



Beauty Tips: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేయడం మీరు గమనించే ఉంటారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ప్రతి ఒక్కరూ ముఖంలో మెరుపును కలిగి ఉండేందుకు ఇష్టపడతారు.

ఇందుకోసం మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ అన్నిటిని వాడుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలో ఆయుర్వేద పద్దతుల ద్వారా నిగారింపుని పొందవచ్చు. 

ఇందుకోసం తిప్పతీగ ఆకుల మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల మీరు కోల్పోయిన నిగారింపు మళ్లీ మీ సొంతమవుతుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తిప్పతీగ ఆకుల ఫేస్ మాస్క్‌ 

ముఖంపై మెరుపు తీసుకురావడానికి తిప్ప తీగ ఆకులు బాగా ఉపయోగపడుతాయి. ముందుగా కొన్ని ఆకులని తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని 15 నుంచి 20 నిమిషాలు ముఖంపై అప్లై చేయాలి. 

ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడగాలి. వెంటనే ముఖంపై తక్షణ మెరుపు కనిపిస్తుంది. తాజా అనుభూతి పొందుతారు. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఉసిరి, తిప్పతీగ ఆకుల ఫేస్ మాస్క్‌ 

అలాగే ఇంట్లో ఉసిరి, తిప్పతీగ ఆకుల ఫేస్ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా 1 ఉసిరి కాయ, కొన్ని తిప్పతీగ ఆకులు మెత్తగా చేయాలి. 

ఈ మిశ్రమాన్ని ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీంతో ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది. వాస్తవానికి తిప్పతీగలు, ఆకులలో చాలా ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వీటిని ఉపయోగించి అందమైన చర్మాన్ని పొందవచ్చు.

close