Sobhan babu: సినిమాలు మానేశాక శోభన్ బాబు బయట కనిపించక పోవడానికి కారణం ఆ అమ్మాయి మాటలేనా..? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Sobhan babu: సినిమాలు మానేశాక శోభన్ బాబు బయట కనిపించక పోవడానికి కారణం ఆ అమ్మాయి మాటలేనా..?

8/30/2023



Sobhan babu: టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ సోగ్గాడిగా మిగిలిపోయిన శోభన్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అన్ని హీరోల పాత్రల్లోనే నటించాడు తప్ప వయసు పెరిగిన కొద్దీ ఆయనకు తగ్గ పాత్రల్లో అడిగితే అస్సలు నటించలేదు.

అంతే కాదు మూడున్నర దశబ్దాలు ఆయన ఇండస్ట్రీని ఏలినప్పటికీ ఆ తర్వాత వయసు మీద పడ్డాక సినిమాల్లో నటించడానికి ఆయన ససేమీరా చెప్పారు.

అంతేకాదు ఎన్నో సినిమాల్లో ఈయనకు హీరోగా కాకుండా ముఖ్యపాత్రల్లో అవకాశాలు వచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తాం అన్నప్పటికీ కూడా ఆయన సినిమాల్లో నటించలేదు. దానికి ప్రధాన కారణం ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల్లో హీరో గానే ఉండాలి అని భావించారు. 

అలా శోభన్ బాబు (Sobhan babu) చివరి వరకు కూడా హీరో గానే ఉన్నారు. ఇక అలాంటి శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీకి 1996లో రిటైర్మెంట్ లో ప్రకటించారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి ఏ సినిమాలో కూడా కనిపించలేదు.

కానీ రిటైర్మెంట్ ప్రకటించాక ఐదు సంవత్సరాల పాటు తనకి ఇష్టమైన కారులో మద్రాస్ చుట్టూ తన ఆస్తిపాస్తులు చూసుకుంటూ తనకు నచ్చిన పాటలను కారులో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తిరిగేవారు.అంతేకాదు ఏవైనా సినిమా ఫంక్షన్లకు కూడా హాజరయ్యేవారు.

అయితే ఓ రోజు సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి ఏంటండి శోభన్ బాబు (Sobhan babu) గారు మీ వయసు మీద పడిపోయింది. ముసలివారు అయిపోతున్నారు అని చెప్పిందట.

ఇక ఆ అమ్మాయి చెప్పిన ఒకే ఒక్క మాటకి అప్పటినుండి శోభన్ బాబు బయటికి రావడమే మానేశారట. అంతేకాదు ఎంత అవసరం వచ్చినా కూడా ఇంట్లో నుండి బయటికి కదిలేవారు కాదట. అలా ఆయన చనిపోయే వరకు కూడా ఇంట్లోనే ఉన్నారు. 

బయటికి వచ్చి తన మొహాన్ని చూపించి జనాలలో ఉన్న హీరో అనే గుర్తింపును పోగొట్టుకోకుండా ఉండడానికి తన ముసలి మొహాన్ని అభిమానులకు చూపెట్టుకోలేక చివరి రోజుల్లో ఆయన ఆ అమ్మాయి అన్న ఒకే ఒక మాట కారణంగా ఇంటి నుండి బయటకు రాలేదట శోభన్ బాబు.

close