Apcmjagan: కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఏపీ సీఎం సంచలన నిర్ణయం..!! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Apcmjagan: కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఏపీ సీఎం సంచలన నిర్ణయం..!!

9/04/2023

 Apcmjagan: కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్.. ఏపీ సీఎం సంచలన నిర్ణయం..!!

Apcmjagan.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ (Apcmjagan)రెడ్డి తను ప్రవేశపెట్టిన పథకాలతో పాటు సరికొత్తగా పథకాలను అమలు చేస్తే ప్రజలలో మమేకం అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు.
ఇటీవల కాలంలో పలు రకాల సేవలను సైతం సచివాలయాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైనా భూములు అమ్మాలన్న కొనాలన్న రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసులో వెయిట్ చేయవలసిన అవసరం లేదట.. కేవలం 20 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయిపోతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుపుతున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ కోసం కొత్త ఆన్లైన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందని తెలుపుతున్నారు.

అయితే మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లోనే జరుగుతుందట.అయితే దీనివల్ల జీవనోపాధి దెబ్బతింటుందంటు డాక్యుమెంటల్ రైటర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు . అయితే ఎన్నో దశాబ్దాలు నాటి నుంచి రిజిస్ట్రేషన్ విధానాన్ని జగన్ స్వస్తి చెప్పేందుకే ఇలా సరికొత్త విధానాన్ని ఆన్లైన్లో ద్వారా ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది.. రిజిస్ట్రేషన్ శాఖలో CARD 1.0 స్థానంలో CARD 2.0 తీసుకురావడం జరుగుతోందట. ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ చాలా సులువుగా అవుతుందని ఏపీ సీఎం తెలుపుతున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 20 నిమిషాలలోనే పూర్తి అవుతుందని అధికారులు కూడా తెలుపుతున్నారు. ప్రజలు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తరువాత రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఈ కొత్త విధానాన్ని సైతం రూపొందిస్తున్నారు.. మధ్యవర్తుల మీద ఆధారపడకుండా ప్రజలు సులువుగా ఇక మీదట రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వినియోగదారులు సైతం తమ వివరాలను నేరుగా నమోదు చేసుకొని ఫీజులు చెల్లించవచ్చట.నిమిషాలలోనే దస్తా వీధులు కూడా ఇవ్వడం జరుగుతుందట.

మొదట ఈ ప్రక్రియను కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలో నిన్నటి రోజు నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈనెల 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆధార్ తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని లింక్ చేయడం వల్ల అసలు వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదని అధికారులు సైతం స్పష్టం చేశారు.. ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న బయోపిక్ వివరాలతో సరి పోల్చిన తరువాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలుపుతున్నారు.