ECIL RECRUITMENT: Apply for 39 Manager Posts. Rs. Salary up to 2 lakhs
ECIL RECRUITMENT: 39 మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి. రూ. 2 లక్షల వరకు జీతం
హైదరాబాద్ నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ECIL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 23లోగా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు: 39, వీటిలో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
విభాగాలు: హెచ్ఆర్, లా, టెక్నికల్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్/ఇంజినీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా.
అనుభవం: 5-14 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయో పరిమతి: 32-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ. 500.
జీతం వివరాలు: పోస్టును బట్టి నెలకు రూ. 50వేల నుంచి రూ. 2 లక్షల వరకు.
ECIL రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చినట్లుగా, పైన పేర్కొన్న పోస్ట్‌లకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. రూ. 200000.
సీనియర్ మేనేజర్ కోసం- పైన పేర్కొన్న పోస్ట్‌లకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. 70000 నుంచి రూ. 200000 మధ్య ఇవ్వబడుతుంది..
డిప్యూటీ మేనేజర్ కోసం- పైన పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. 50000 నుంచి రూ. 160000 మధ్య ఇవ్వబడుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2023