క్రీడాకారులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన, క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. క్రీడా కోటా ఉద్యోగాల నియామక ప్రకటనను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత 11.09.2023 నుండి 20.09.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. స్పోర్ట్స్ ట్రయల్స్ 03.10.2023 నుండి 05.10.2023 మధ్య నిర్వహిస్తున్నట్లు ముందస్తుగా అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, క్రీడా విభాగాలు, అధికారిక దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ..
క్రీడా విభాగాలు:- అతలిటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రికెట్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హాకీ, కబ్బడి, హ్యాండ్ బాల్, స్క్వాష్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ పోలో.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
వయోపరిమితి :
- 26.12.2022 నుండి 26.07.2026 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపికలు నిర్వహించే తేదీ నాటికి 21 సంవత్సరాలకు మించకూడదు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి గణితం/ ఫిజికల్ సైన్స్/ ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50% మార్పులతో ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
లేదా
- మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సును (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగాల్లో కనీసం 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- అలాగే సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ/ అంతర్జాతీయ, జూనియర్/ సీనియర్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- వీటితోపాటు నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండడం అవసరం.
- శరీరంపై టాటూలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనర్హులు..
ఎంపిక విధానం :
- సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ పరీక్షలను నిర్వహించి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మరియు మెడికల్ టెస్ట్ ల ఆధారంగా చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన క్రీడాకారులకు లకు; ఈ దిగువ పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ 30,000/-,
- రెండవ సంవత్సరం రూ.33,000/-,
- మూడవ సంవత్సరం రూ.36,500/-,
- నాలుగవ సంవత్సరం రూ.40,000/-.. తో ఇతర ఆరోగ్య భీమా/ కాంట్రిబ్యూషన్ ప్యాకేజీలు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://agnipathvayu.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.09.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.09.2023 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.