PM Kisan Samman Nidhi: రైతులకు షాక్.. ఇక వీరి అకౌంట్లలోకి డబ్బులు రావు! లిస్ట్‌లో మీరున్నారేమో చెక్ చేసుకోండి!
PM Kisan Scheme | రైతులకు అలర్ట్. పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే ఈ స్కీమ్‌లో కొత్తగా చేరాలని ప్లాన్ చేసే వారు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి.
లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డబ్బులు అకౌంట్లలోకి రాకపోవచ్చు.
మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6 వేలు వస్తున్నాయి. ఈ డబ్బుల ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తున్నాయి. రూ. 2 వేల చొప్పున లభిస్తున్నాయి.
ఏడాదికి మూడు విడత చొప్పున రూ.2 వేలు రూపంలో మొత్తంగా రూ. 6 వేలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి. ఇలా డబ్బులు పొందే రైతులు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. కొన్ని పొరపాట్లు చేస్తే.. ఈ డబ్బులు అకౌంట్లలోకి రాకపోవచ్చు. అప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ స్కీమ్ కొంత మందికి వర్తించదని గమనించాలి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వంటి వారికి పొలం ఉన్నా డబ్బులు రావు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా పీఎం కిసాన్ వర్తించదు. నెలకు రూ.10 వేలు లేదా ఆపైన పెన్షన్ తీసుకునే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో లేదు.
అదేసమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవిలో ఉన్నా లేదంటే మాజీ రాజకీయ నాయకులకు స్కీమ్ వర్తించదు. వీరికి మాత్రమే కాకుండా అర్హత కలిగి ఉండి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వంటి వాటిల్లో వివరాలు తప్పుగా ఉన్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు రావని గుర్తించాలి.
ఒకే ఇంట్లో భార్యాభర్తల పేరుపై పొలం ఉంటే కేవలం ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. ఇద్దరికీ రావు. అలాగే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్న వారు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రాకుండా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆలస్యం చేయవద్దు.
అదే సమయంలో పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరాలని భావించే పైన ఇచ్చిన వారికి స్కీమ్ వర్తించదని తెలుసుకోవాలి. కాగా పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటకి 14 విడతల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు 15 విడత డబ్బులు రావాల్సి ఉంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.