Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?

9/16/2023

 Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?

Sweet Corn: బొగ్గులపై కాల్చే మొక్కజొన్న పాత్తులను మనం ఇష్టంగా తింటాం. ఆ బొగ్గులను ఎక్కడి నుంచి తెస్తున్నారనేది పట్టించుకోం. తాజాగా ఓ వృద్ధుడు శ్మశానంలో శవాలను కాల్చగా మిగిలిన బొగ్గులను తీసుకొస్తుండగా అక్కడి నుంచి వెళుతున్న ఓ వ్యక్తి ఆ వృద్ధున్ని గమనించాడు.
ఆ ముసలాయన్ను ఆపి బొగ్గులను ఎక్కడికి, ఎందుకు తీసుకుని వెళుతున్నావు అంటూ ప్రశ్నించాడు. తాత ముందు సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. ఆ వ్యక్తి ఒకటి రెండు సార్లు నిలదీయటంతో తాత నోరువిప్పాడు. ఈ బొగ్గులు మొక్కజొన్న కంకులు కాల్చేకి తీసుకువెళుతున్నట్లు చెప్పడంతో బైక్‌ పై వెళుతున్న వ్యక్తం ఖంగు తిన్నాడు. ఈ బొగ్గు నీవే మొక్కజొన్నలు కాల్చేకి తీసుకుపోతున్నావా? అంటూ అడగగా.. కాదు మొక్కజొన్న పొత్తులు కాల్చేవారికి అమ్మడానికి తీసుకువెళుతున్నట్లు తాత తెలిపాడు. ఇది కరెక్ట్‌ కాదు కాదా? దీని వల్ల సమస్యలు వస్తాయి కాదా ? అని బైక్‌ పై వెళుతున్న వ్యక్తి ప్రశ్నించగా.. బదులు ఇవ్వకుండా అక్కడనుంచి వెళ్లిపోయాడు తాత. శ్మశానంలోని బొగ్గులు తీసుకునేందుకు నీకు ఎవరు హక్కు ఇచ్చారు అంటూ ప్రశ్నించినా? పట్టించుకోలేదు. సర్పంచ్, అధికారులకు ఫోన్ చేస్తా ఆగు అంటూ బైక్ పై వున్న వ్యక్తి చెబుతున్న భయంతో వెనుతిరిగాడు తాత. ఈ ఘటన తెలంగాణలో జరగగా.. ఏ ఏరియాలో అన్నది వెల్లడి కాలేదు. 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం మొక్కజొన్నలు ఇష్టంగా తింటాం అలాంటి మొక్కజొన్నలను శవాలు కాల్చేసిన బొగ్గులతో కాలుస్తున్నారా? అంటూ నోర్లు వెల్లబెడుతున్నారు. ఛీ చివరకు శవాలను కాల్చే బొగ్గులను కూడా మనషులు అమ్ముకోవాడానికి వెనుకాడటం లేదని మండిపడుతున్నారు. అయితే ఆవ్యక్తి ఎక్కడి శ్మశానంలో బొగ్గులను తీసుకువస్తున్నాడు. శ్మశానంలో బొగ్గులను ఎవరు అమ్ముతున్నారు. ఇలా అక్కడ వున్న ఒక్క శ్మశానం నుంచి మాత్రమేనా.. లేదా వేరే శ్మాశానాల్లో కూడా ఇలానే బొగ్గు విక్రయాలు జరుపుతున్నారా? అనే దానిపై నెటిజన్లు కమెంట్లు చేస్తు్న్నారు. ఏదీ ఏమైనా మొక్కజొన్న ఇష్టంగా తినే ప్రతి ఒక్కరు బయట కాల్చే మొక్కజొన్నలు తినేప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.