TS Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1,931 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

TS Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1,931 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

9/22/2023


TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో 1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 33 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదట 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల వీటికి అదనంగా మరో 411 పోస్టులను జత చేశారు. మొత్తంగా 1931 MPHA(F) పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

పోస్టుల వివరాలు:

మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు.
మొత్తం ఖాళీలు: 1,931.

విద్యార్హతలు:

అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (Female) ట్రైనింగ్ కోర్సు పూర్తి చేయాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం:

రాతపరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రాలు:

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

అప్లికేషన్ ఫీజు:

రూ.500/- ఫీజు చెల్లించాలి

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది:

2023 సెప్టెంబర్ 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Vacancy Details

Full Notification

Application form

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP LinkSource link