TSPSC Group-4 Results 2023 | గ్రూప్-4 ఫలితాల అప్డేట్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

TSPSC Group-4 Results 2023 | గ్రూప్-4 ఫలితాల అప్డేట్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే?

9/22/2023


TSPSC Group-4 Results 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. ఫలితాలను అక్టోబర్ నెలలో ఇవ్వాలని భావిస్తున్నది. గ్రూప్-4 కేటగిరిలో వివిధ విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2)ను జులై 1న నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది, పేపర్-2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిషన్ కు తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన టీఎస్పీఎస్సీ.. పదిరోజుల్లోగా గ్రూప్-4 ఫైనల్ కీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. తుది ఫలితాలను అక్టోబర్ నెలలో ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తున్నది.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link



Source link

close