Apply for Prime Minister's scheme for pregnant women, cash deposit in bank. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Apply for Prime Minister's scheme for pregnant women, cash deposit in bank.

10/25/2023

Apply for Prime Minister's scheme for pregnant women, cash deposit in bank.

గర్భిణీ స్త్రీలకి ప్రధానమంత్రి పథకం, బ్యాంకు లోకి నగదు జమ .. ఇలా అప్లై చేసుకోండి.

Apply for Prime Minister's scheme for pregnant women, cash deposit in bank.

మహిళలకు సెంట్రల్ గవర్నమెంట్ మంచి పథకాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ ఆర్టికల్ ని మీకోసం మేము అందిస్తున్నాం. డెలివరీ అయిన మహిళకు ప్రభుత్వం రూ.5000 ఆర్ధిక సాయం అందిస్తుందని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి..? దీనికి ఎలాంటి అర్హతలను కలిగి ఉండాలి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

‘ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన’ అనే పేరుతో డెలివరీ అయిన మహిళలకు.. 2010 లో చేయూత అందించే పథకం స్టార్ట్ చేశారు. అయితే 2017 లో ‘ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన’ అని దాని పేరు మార్చారు. ఈ స్కీమ్ కింద గర్భిణీలు డెలివరీ అయిన తరువాత రూ.5000 వేలు బెనిఫిట్ పొందొచ్చు. ఈ స్కీమ్‌లో సాయం కోరే స్త్రీలు అంగన్ వాడీ కేంద్రం, లేదా ఉమాంగ్ యాప్ లేదా ఉమాంగ్ వెబ్ సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకానికి అప్లై చేసుకున్న వెంటనే మొదట విడత రూ.1000 బ్యాంకు అకౌంట్‌లో వేస్తారు. రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ క్రింద బిడ్డ పుట్టిన 6 నెలల తర్వాత మరో రూ.2000 లు బ్యాంకులో వేస్తారు.

ఇక 3 వ ఇన్‌స్టాల్ మెంట్ క్రింద రూ.2000 వేక్సినేషన్, బర్త్ సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో బ్యాంకులో వేస్తారు. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. కానీ, వారికి ఎటువంటి ఇన్కమ్ ఉండకూడదు. హౌస్ వైఫ్ అయ్యి ఉండాలి. డెలివరీ అయ్యి 150 రోజులలోపు అయిన మహిళలు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే గుర్తు పెట్టుకోండి.. డెలివరీ అయిన తరువాత మాత్రమే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఈ పథకానికి అర్హులైన మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కేంద్రం అందించే లబ్ధిని పొందండి.

close