Do you mention your phone number anywhere while paying any bill? What did the center say? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Do you mention your phone number anywhere while paying any bill? What did the center say?

10/14/2023

Do you mention your phone number anywhere while paying any bill?  What did the center say?

ఏదైనా బిల్లు కట్టే సమయంలో ఎక్కడైనా మీ ఫోన్ నంబర్ చెబుతున్నారా? కేంద్రం ఏం చెప్పిందంటే?

Do you mention your phone number anywhere while paying any bill?  What did the center say?

Malls and Shops Cant Ask Customers Mobile Number: మనం బయట ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు బిల్ డైరెక్ట్ క్యాష్ రూపంలోనే, కార్డ్ పేమెంటో చేస్తాం కదా. అయితే కొన్ని చోట్ల రిటైలర్లు మన మొబైల్ నంబర్ అడుగుతుంటారు. మనం పొరపాటునో, అడిగారనో, ఏం ఆలోచించకుండా నంబర్ ఇచ్చేస్తుంటాం. అయితే మనం కచ్చితంగా నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా.. దీని వల్ల నష్టాలేంటి.. కేంద్రం ఏం చెప్పింది తెలుసుకుందాం.

Sale of Good: రాధ ఒక గృహిణి. ఆమెకు ఫోన్ ఎత్తడం.. వేరే వాళ్లకు కాల్ చేయడం తప్ప దీనిని వాడటం పూర్తిగా తెలియదు. పెద్దగా యాప్స్ కూడా వాడదు. అయితే బ్యాంక్ అకౌంట్‌లో దాచుకున్న డబ్బు మొత్తం పోగొట్టుకుంది.

రాణి వారంలో రెండు మూడు రోజులైనా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంది. కొనుగోలు చేయడం సహా పేమెంట్ చేయడం అంతా ఫోన్ ద్వారానే జరుగుతుంది. అడిగిన ప్రతి చోటా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తుంది. ఆమెకు ఇప్పుడు 3 నెలలుగా వేర్వేరు నంబర్ల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయి.

వీళ్లకే కాదు. ఇలాంటి పరిస్థితి మనలో కూడా చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. కానీ అంతలా పట్టించుకోకపోవచ్చు. కానీ చివరికి జరిగేది ఇదే. లక్కీ డ్రాలు అని.. బహుమతులు అని కొన్ని కాల్స్, లాటరీ గెలిచారని.. కొన్ని వస్తువులపై మీకు ఆఫర్ ఉందని... లోన్స్ ఇస్తామని.. క్రెడిట్ కార్డుపై మంచి ఆఫర్లు ఉన్నాయని ఫోన్లు వస్తుంటాయి. వీటికి భయపడి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకునే వారు కూడా ఉన్నారు. మనకే ఎందుకిలా వస్తున్నాయని మాత్రం అనుకోకండి..

మనం తొందరలో పట్టించుకోకుండా.. షాపింగ్ మాల్స్, మార్ట్‌లు, మెడికల్ షాప్‌లు, రిటైల్ దుకాణాలు, నెట్ సెంటర్లు, ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు, పేమెంట్స్ చేసే దగ్గర ఇలా ప్రతి చోటా మొబైల్ నంబర్ ఇవ్వడం వల్లే. సైబర్ నేరగాళ్ల చేతికి మన నంబర్ చిక్కి.. ఇలాంటి కాల్స్ దగ్గర నుంచి ఆన్‌లైన్ మోసాలకు కూడా గురవుతుంటాం.

ఆన్‌లైన్ షాపింగ్‌పై ఇటీవల చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే ఇంటర్నెట్ వేదికగా రీసెల్లర్ గ్రూప్స్‌లో చేరి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు.. ఆకర్షణీయ ఫొటోలతో గ్రూప్స్ క్రియేట్ చేసి అంతర్జాలంలో పెడుతున్నారు. వాటిని మనం క్లిక్ చేయగానే గ్రూప్‌లో చేరతాం. చాలా వరకు వీటిల్లో ఫేక్ ఉండగా.. మోసపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు.

కేంద్రమే చెప్పింది..

ఎంత పెద్ద మాల్ అయినా కూడా మనం మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. రిటైలర్స్‌కు ఇదివరకే అడ్వైజరీ కూడా జారీ చేసింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వ్యక్తిగత వివరాలు ఇవ్వడం అనేది.. కస్టమర్స్ రక్షణ చట్టం ప్రకారం.. అన్యాయ, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందికి వస్తుందని ఈ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు.

ఇంకా ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి ఆర్థిక లావాదేవీలన్నింటికి ఇప్పుడు మన మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి.. ఇదొక్కటి దొరికితే చాలు ఒక్క ఓటీపీతో అకౌంట్ కూడా ఖాళీ అయిపోతుంది. మభ్యపెట్టి మన పిన్ తెలుసుకోవడం సైబర్ నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే జాగ్రత్తగా ఉండాలి. బయట నంబర్ ఇవ్వకపోవడం మంచిది. ఇంకా.. అపరిచితులు ఫోన్ చేస్తే ఆర్థిక సంబంధిత వివరాలు చెప్పొద్దు. ముఖ్యంగా పిన్ వంటివి అస్సలు ఇతరులతో పంచుకోవద్దు.


close