Electricity Bills: Is the current bill increasing.. Reduce your current bill by half with these techniques..!.! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Electricity Bills: Is the current bill increasing.. Reduce your current bill by half with these techniques..!.!

10/13/2023

Electricity Bills: Is the current bill increasing.. Reduce your current bill by half with these techniques..!.!

Electricity Bills: కరెంట్ బిల్లు ఎక్కువొస్తోందా.. ఈ టెక్నిక్స్‌తో మీ కరెంట్ బిల్ సగానికి తగ్గించుకోండి..!.!

Electricity Bills: Is the current bill increasing.. Reduce your current bill by half with these techniques..!.!

Electricity Bills: మీరు కరెంటు బిల్లును ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. కొన్ని ప్రత్యేక విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.  కరెంటు వాడకంపై అవగాహన లేకపోవడం.. అనవసరంగా వినియోగించడం.. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల బిల్లులు అధికంగా రావడంతో పాటు విద్యుత్‌ వృథా అవుతుంటుంది. దీనిని అరికట్టేందుకు చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. పవర్‌ సేవింగ్‌ అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, అవగాహన ఉంటే పొదుపు సాధ్యం అవుతుంది. ఇంట్లో టీవీ, ఫ్యాన్‌, ఏసీ, ఫ్రిజ్‌, గీజర్‌, ఓవెన్‌, తదితర పరికరాలు ఉన్నప్పుడు అధిక బిల్లు రావడం సహజమే కానీ,.. వాటిని వాడే విషయంలో మీరు కొన్ని టెక్నిక్స్‌ పాటిస్తే విద్యుత్ భారం నుంచి బయటపడొచ్చు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో పవర్‌ సేవింగ్‌ ఎలా చేయాలి..? ఎలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వాలి? ఇప్పుడు చూద్దాం.

విద్యుత్ ఆదా చేసుకోవాలి.. కరెంటు బిల్లుని తగ్గించుకోవాలి.. అని ఎవరైతే ఆలోచిస్తున్నారో.. మీరు ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి ఒక పరికరాన్ని ఆర్డర్ చేయాలి. దీని ద్వారా 50 % వరకు కరెంట్ ని ఆదా చేసుకోవచ్చు. మీరు Flipkart నుండి MD Proelectra పవర్ సేవర్‌ని ఆర్డర్ చేయండి. ఈ పరికరం ధర కేవలం రూ.800 మాత్రమే. మీరు 37 శాతం తగ్గింపుతో దీనిని రూ.499 కి కొనుగోలు చేయోచ్చు.

మీరు అనేక బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా ఈ పరికరం ధరను మరింత తగ్గింపుతో కొనాలి అంటే… బ్యాంక్ ఆఫర్లతో ఈ పరికరం రూ.200లోపే కొనుగోలు చేయోచ్చు. ఇక దీనిని ఇన్ స్టాల్ చేయడం కూడా చాలా తేలిక. కంపెనీ విద్యుత్తు పొదుపుని క్లెయిమ్ చేస్తున్నందున మీరు ఇంట్లో ఎలక్ట్రిసిటీ సేవర్ పరికరాన్ని అమర్చడానికి ముందు ఎలక్ట్రీషియన్‌ను కూడా సంప్రదించాలి. ఈ పరికరాన్ని ఇంట్లో అమర్చుకుంటే 45 శాతం విద్యుత్ ఆదా అవుతుందని సంబంధిత కంపెనీ పేర్కొంది. ముందుగా ఏసీ ఎలా వాడాలో తెలుసుకోవాలి. గదిలో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి.

దీని వల్ల గాలి బయటకు వెళ్లే ఛాన్స్ లేకుండా గది త్వరగా కూల్ అవుతుంది. వెంటనే చల్లబడాలని 18 డిగ్రీలు పెట్టేస్తుంటారు. కానీ, ఎప్పుడూ 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు కరెంటు బిల్లు తగ్గుతుంది. అలాగే 5 స్టార్ రేటెడ్ ఏసీలు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి. మీరు విద్యుత్ బిల్లుని ఆదా చేయాలనుకుంటే, 5 స్టార్ రేటింగుతో ఏసీని కొనుగోలు చేయండి. నెలలో 30 రోజులు సూర్యరశ్మి ఉంటుంది. మీరు మీ ఇంటి పైకప్పుపై సౌలార్ పలకాలను అమర్చవచ్చు. ఇది ఒక సారి పెట్టుబడి పెడితే చాలు.. ఇది మీ విద్యుత్ బిల్లును తగ్గించగలదు.

మీ ఇంటికి ఎంత అవసరం అవుతుందో లెక్క చేసుకుని ఈ సోలార్‌ను ఇన్‌ స్టాల్ చేసుకోవచ్చు. CFL బల్బు, ట్యూబ్ లైట్ కంటే ఐదు రెట్లు విద్యుత్ ని ఆదా చేస్తుంది. కాబట్టి ట్యూబ్ లైట్‌కు బదులుగా CFL ఉపయోగించండి. మీకు గదిలో లైట్ అవసరం లేకపోతే, దాన్ని ఆపి వేయండి. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, మోషన్ సెన్సార్, డిమ్మర్ వంటి వాటిని యూజ్ చేయండి. ఇంట్లో గీజర్‌ ఉంటే ఒక్కొక్కసారి ఆన్‌ చెయ్యకుండా.. ఒకేసారి వేడి చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకరి తర్వాత మరొకరు స్నానాలు చేస్తే మంచిది.

థర్మోస్టాట్‌ 50–60 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్‌ నీటిని వాడేలా పైపులని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కరెంటు బిల్లులో నెలకు కనీసం రూ.400 వరకు ఆదా చేయవచ్చు. ఫ్రిజ్‌ ఉంచే ప్రదేశానికి, గోడకి మధ్య వేడి తగ్గించేలా కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో వాడే ఫ్రిజ్‌ పాతదైతే నెలకు 160 యూనిట్లకి పైగానే కరెంటు కాలుతుంది. అదే స్మార్ట్‌ ఫ్రిజ్‌ అయితే అవసరమైనప్పుడే ఆన్‌ అవుతాయి. లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల కరెంటు బిల్లు రూ.300 వరకు తగ్గే వీలు ఉంది. వాషింగ్ మెషీన్‌లో ఎప్పుడూ లోడ్‌కు తగ్గట్టుగా దుస్తులు వేయాలి. లోడ్‌కు మించి వేయకూడదు.

అలాగని ట్రిప్పుకు ఒక్కో జత బట్టలను ఉతక కూడదు. ఇలా చేస్తే విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. అన్నింటికీ మించి మెషీన్‌ పని విధానాన్ని కనీసం మూడు నెలలకి ఒకసారైనా మెకానిక్‌ చేత పరీక్షించాలి. మోటర్‌ స్లో అయితే విద్యుత్‌ వాడకం ఎక్కువవుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నెలకు రూ.60 పైగానే ఆదా చెయ్యొచ్చు. మైక్రో ఓవెన్‌ను వంటకానికి వాడే పదార్థాన్ని బట్టి టైం సెట్‌ చేయాలి. ఒక్కసారి ఓవెన్ ఆన్‌ చేశాక తరచూ తెరిచి చూస్తే టెంపరేచర్‌ అనేది పడిపోతుంది. అది మళ్లీ వేడెక్కాలంటే ఎక్కువ కరెంట్‌ తీసుకుంటుంది. అలాగే చిన్నచిన్న వంటలకు ఓవెన్‌ వాడకపోవడమే మంచిది. ఇలాచేస్తే రూ.150 వరకు బిల్లు ఆదా అవుతుంది.