Redmi Note 12 5G: ఈ ఫోన్ భారతదేశంలో ఈ ఏడాది జనవరి మొదట్లో రూ.17,999కి ప్రారంభమైంది. ప్లస్ సభ్యులు దీన్ని ఇప్పుడు రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ Snapdragon 4 Gen 1 ప్రాసెసర్, 48MP ప్రైమరీ కెమెరా, AMOLED డిస్ప్లేతో వస్తుంది. (Image- Redmi)
Realme 11X 5G: ఈ ఫోన్ ఆగస్టులో భారతదేశంలో ప్రారంభమైంది. రూ.14,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ప్లస్ సభ్యులు ఇప్పుడు దీన్ని రూ.12,999కి కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్, AMOLED డిస్ప్లేతో వస్తుంది. (Image- Realme)
Poco X5 5G: ఈ ఫోన్ మార్చిలో భారతదేశంలో లాంచ్ అయ్యింది. ప్రారంభ ధర రూ.20,999గా ఉంది. ప్రస్తుతం ప్లస్ సభ్యులు దీనిని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ Snapdragon 695 ప్రాసెసర్, 48MP ప్రైమరీ కెమెరాతో ఉంది. (Image- Poco)
Infinix Note 30 5G: ఈ ఫోన్ ఈ సంవత్సరం జూన్‌లో భారతదేశంలో ప్రారంభమైంది. ఈ ఫోన్ 108MP ప్రైమరీ కెమెరా, MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌తో వచ్చింది. రూ.14,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం దీనిని రూ.13,499కి కొనుగోలు చేయవచ్చు. (Image- Infinix)
Infinix Hot 30 5G: ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం జూలైలో భారతదేశంలో ప్రారంభమైంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 6020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. కస్టమర్లు ఇప్పుడు అసలు ధర రూ.12,499కి బదులుగా రూ.11,499కి కొనుగోలు చేయవచ్చు. (Image- Infinix)