Gold and silver price today : 'తగ్గేదే లే!' అంటూ దూసుకెళుతున్న పసిడి ధరలు! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Gold and silver price today : 'తగ్గేదే లే!' అంటూ దూసుకెళుతున్న పసిడి ధరలు!

10/29/2023

 Gold and silver price today : 'తగ్గేదే లే!' అంటూ దూసుకెళుతున్న పసిడి ధరలు!

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 600 పెరిగి.. రూ. 57,400కి చేరింది.
శనివారం ఈ ధర రూ. 56,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,000 పెరిగి, రూ. 5,74,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,740గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 660 వృద్ధి చెంది.. రూ. 62,620కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,960గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,600 పెరిగి.. రూ. 6,26,200గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,550గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,400 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,620గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,400గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,620గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,620గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,450గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,670గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,400గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,620గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 74,600గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,600.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)


close