Health Tips: ఆహారం తినేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి.. అప్పుడే పొట్ట, మలబద్దకం సమస్యలు ఉండవు..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Health Tips: ఆహారం తినేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి.. అప్పుడే పొట్ట, మలబద్దకం సమస్యలు ఉండవు..!

10/30/2023

 Health Tips: ఆహారం తినేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి.. అప్పుడే పొట్ట, మలబద్దకం సమస్యలు ఉండవు..!

Health Tips: కొంతమంది ఇష్టారీతిన ఆహారం తీసుకుంటారు. సమయ పాలన పాటించరు. ఏది మంచి ఆహారం, ఏది చెడ్డ ఆహారం అని గుర్తించరు. ఏది దొరికితే అది తినేస్తుంటారు.
దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం సమస్యలు ఏర్పడుతాయి. దీని కారణంగా రోజువారీ కార్యకలాపాలు సరిగ్గా చేయలేము. కడుపు సమస్యలను నివారించడానికి తినేటప్పుడు, తాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

నీరు తాగండి 

ఆహారం తీసుకోవడానికి కొంత సమయం ముందు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటం మంచిది. దీనివల్ల జీర్ణక్రియతో సహా అన్ని శరీర విధులు సరిగ్గా పనిచేస్తాయి. రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. లేదంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది.

అల్లం తినండి
మీరు రోజువారీ ఆహారంలో పరిమిత పరిమాణంలో అల్లం చేర్చుకుంటే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ మసాలా వినియోగం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. శరీరంలోని వ్యాధులు కూడా నయమవుతాయి. పచ్చి అల్లం నమలవచ్చు లేదా అల్లం టీ, అల్లం నీరు, అల్లం మిఠాయిని తినవచ్చు.

పెరుగు తినండి

మనం తప్పనిసరిగా పెరుగు తినాలి. ఇది ప్రోబయోటిక్ ఆహారం. దీనిలో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని స్వభావం చల్లగా ఉంటుంది కాబట్టి కడుపుని చల్లగా ఉంచుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

నడవండి
చాలా మందికి ఆహారం తిన్న వెంటనే మంచం మీద పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా అస్సలు చేయవద్దు. తిన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నడవాలి. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం లేదా గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటుంది.


close