Hello you.. If you don't do this your bank account is empty?2023 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Hello you.. If you don't do this your bank account is empty?2023

10/25/2023

 Hello you.. If you don't do this your bank account is empty?

హెలో మిమ్మల్నే.. ఇలా చేయకుంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ?

Hello you.. If you don't do this your bank account is empty?

వినియోగదారులు ఆధార్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని బేసిక్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఆధార్ కార్డుని ఎవరూ దుర్వినియోగం చేయలేరని డేటా సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఆధార్ కార్డ్ యొక్క పెరుగుతున్న ట్రెండ్‌తో.. దాని దుర్వినియోగం ప్రమాదం కూడా పెరిగింది. ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల వ్యక్తిగత డేటా చోరీకి గురవ్వడమే కాకుండా వారి బ్యాంకు ఖాతాలు కూడా హ్యాక్ అవుతున్నాయి. అంతే కాకుండా కొన్ని నేర కార్యకలాపాలకు కూడా ఆధార్‌ను వినియోగిస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఓ స్కామ్ భయపెడుతోంది. ఈ స్కామ్ లో స్కామర్‌లు కొత్త ఆధార్-ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) లోని లొసుగును యూజ్ చేసి మీ బ్యాంక్ ఖాతాను జీరో చెయ్యొచ్చు. ఈ స్కామ్‌లో, మోసగాళ్లు వేలిముద్ర డేటా, ఆధార్ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్ యాక్సెస్ చేసి బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును దొంగిలించవచ్చు. ఈ స్కాంలో వారికి OTP కూడా అవసరం లేదు. ఈ స్కాంలో అసలు మీ అకౌంట్ నుండి మీ డబ్బు డెబిట్ చేయబడింది అని మీకు SMS నోటిఫికేషన్ కూడా రాదు.

సైబర్ కేఫ్‌లు, ఫోటో కాపీ షాప్స్, హోటల్స్.. ఇలా మొదలైనవి ఆధార్ నంబర్‌లు దొంగిలించబడే ప్రధాన ప్రదేశాలు. అలాగే బ్యాంకు పేరును తెలుసుకోవడానికి స్కామర్‌లు బాధితులను వెంబడిస్తారు కూడా. బ్యాంక్ హోల్డర్స్ వేలిముద్రలని యాక్సెస్ చేయడానికి, స్కామర్లు వారి ల్యాండ్ రిజిస్ట్రీ ఇంకా ఇతర వనరులని కనుగొంటారు. ఈ వేలిముద్ర డేటా కృత్రిమ సిలికాన్ బ్రొటనవేళ్లపై ముద్రించబడుతుంది. ఇది AePS ని యూజ్ చేసి డబ్బును డ్రా చేసుకోడానికి ఉపయోగించబడుతుంది.

ఈ స్కామర్ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలంటే.. స్కామ్ నుండి సేఫ్ గా ఉండటానికి, మీరు తప్పనిసరిగా mAadhaar యాప్ లేదా uidai వెబ్‌సైట్‌ని ఉపయోగించి మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయాలి. AePS ను నిలిపివేయడానికి, మీ ఆధార్ కార్డ్ యొక్క బయోమెట్రిక్ డేటాని లాక్ చేయడానికి, mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. సైన్ అప్ చేయడానికి మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను యూజ్ చేయండి.

మీ ఆధార్ డీటెయిల్స్ ని కన్ఫర్మ్ చేయండి. ఇంకా యాప్‌ని యూజ్ చేసి మీ బయోమెట్రిక్‌ను లాక్ చేసే ఆప్షన్ ఎంచుకోండి. మీకు అవసరమైనప్పుడు యాప్‌ని ఉపయోగించి బయోమెట్రిక్‌లను అన్‌లాక్ చేయవచ్చు.మీ మొబైల్‌లో google Play Storeని తెరిచి, mAadhaar యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఐఫోన్‌ అయితే, యాప్ స్టోర్‌ని ఉపయోగించండి. mAadhaar యాప్‌కు అవసరమైన పర్మిషన్స్ అనుమతించండి. మీ ఫోన్‌లో mAadhaar ఇన్‌స్టాల్ అయ్యాక యాప్ పాస్‌వర్డ్‌ని సెట్ చేయ్యండి. పాస్వర్డ్ ఖచ్చితంగా 4 అంకెలు (అన్ని సంఖ్యలు) కలిగి ఉండాలని గుర్తు పెట్టుకోండి.

close