Huge good news for students.. Scholarship for five years.. Rs. 20 thousand annually. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Huge good news for students.. Scholarship for five years.. Rs. 20 thousand annually.

10/27/2023

Huge good news for students.. Scholarship for five years.. Rs. 20 thousand annually.

విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఐదేళ్ల పాటు స్కాలర్‌షిప్.. ఏటా రూ.20 వేలు.

Huge good news for students.. Scholarship for five years.. Rs. 20 thousand annually.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా శాఖ దేశంలో పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐదు సంవత్సరాల పాటు స్కాలర్‌షిప్ అందిస్తారు. మొత్తం 82,000 మంది పేద విద్యార్థులకు కేంద్రం ఉపకార వేతనాన్ని అందిస్తుంది. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయించారు. డిగ్రీ, పీజీ, BE/Btech, మెడిసిన్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 80 శాతం మార్కులతో ఇంటర్/12 వ తరగతి/సమానమైన అర్హతను కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షలకు మించకూడదు.

స్కాలర్‌షిప్ ఇచ్చే విధానం: విద్యార్థులకు ఐదేళ్ల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. డిగ్రీ చదువుతున్న వారికి మూడేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.12,000. పీజీ చదువుతున్న వారికి రెండేళ్ల పాటు ఏటా రూ.20,000. ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి మూడు ఏళ్లు ఏటా రూ.12,000. అదే చివరి ఏడాది మాత్రం రూ.20,000 చెల్లిస్తారు.

దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్, 31

వెబ్‌సైట్: https://scholarships.gov.in/

నోటిఫికేషన్: https://scholarships.gov.in/public/schemeGuidelines/Guidelines_DOHE_CSSS.pdf

close