సీబీఎస్ఈ బడుల్లో అదనంగా
ఐటీ సబ్జెక్టు
ఎనిమిదో తరగతి వరకే హిందీ పరీక్ష
ఐటీ, కెరీర్ గైడెన్స్కు ఉపాధ్యాయుల నియామకం
*కేంద్రీయ, నవోదయ, ఏకలవ్య ఉపాధ్యాయులతో మంత్రి బొత్స సమావేశం*
*ఈనాడు, అమరావతి*: సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఐటీ సబ్జెక్టును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సీబీఎస్ ఈలో 9, 10 తరగతుల్లో అయిదు సబ్జెక్టుల విధానం ఉంటుంది. అంటే ఆంగ్లం, తెలుగు, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. వీటికి అదనంగా ఆరో సబ్జెక్టుగా ఐటీ (కంప్యూటర్స్) ఉంటుంది. సీబీఎస్ఈ పాఠశాలల్లో సబ్జెక్టుల అమలు, ఉపా ధ్యాయుల నియామకం, అర్హతలు, పరీక్షల విధా నంపై నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఏక లవ్య పాఠశాలల ఉపాధ్యాయులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా బడుల్లో అమలు చేస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. గణితం, సాంఘిక, సామాన్యశా స్ట్రాల్లో ఏదైనా సబ్జెక్టులో ఒక విద్యార్థి అనుత్తీర్ణు డైతే ఐటీలో వచ్చే మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణుడిగా పరిగణిస్తారు. అందుకోసం ఆరో సబ్జెక్టుగా ఐటీని ప్రవేశ పెట్టాలని నిర్ణయిం చారు. హిందీ సబ్జెక్టును 9వ తరగతి వరకు బోధించినా 8వ తరగతి వరకే పరీక్ష ఉంటుంది. సీబీఎస్ఈలో మార్చిలోనే పరీక్షలు పూర్తి చేసి, ఏప్రిల్ నుంచి రాబోయే తరగతి పాఠాలు బోధి స్తారు. మే నుంచి వేసవి సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఇదే విధానాన్ని ఇక్కడి బడుల్లోనూ అమలు చేసే అంశంపై ప్రభుత్వం పరిశీలి స్తోంది. సీబీఎస్ఈ బడుల్లో ఐటీ బోధన, కెరీర్ గైడెన్స్కు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించ నున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి కమిషనరేట్ పంపింది. వెయ్యి పాఠ శాలలకు 2వేల మందిని నియమించాలని భావి స్తోంది. అయితే, ఈ పోస్టులకు శాశ్వత ప్రాతిప దికనా... లేక కాంట్రాక్టు విధానంలో నియమి స్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమావేశంలో కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, దేవానందరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు