Kidney Stones Food : కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఏ ఫుడ్ తినాలో.. వేటిని తినకూడదో తెలుసుకోండి..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Kidney Stones Food : కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఏ ఫుడ్ తినాలో.. వేటిని తినకూడదో తెలుసుకోండి..!

10/31/2023

 Kidney Stones Food : కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఏ ఫుడ్ తినాలో.. వేటిని తినకూడదో తెలుసుకోండి..!

Kidney Stones Food : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు.

వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. నీటిని తక్కువగా తాగడం, ఉప్పు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యపాన సేవనం వంటి వివిధ కారణాల చేత మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా కడుపులో నొప్పి, మూత్రవిసర్జన సమయంలో తీవ్ర అసౌకర్యం, తల తిరిగినట్టు ఉండడం, వాంతులు వంటి ఇతర సమస్యలను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మందులు, శస్త్ర చికిత్స ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పవచ్చు.

అయితే మందులతో పనిలేకుండా మన ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఈ మార్పులు చేసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు రోజూ ఆపిల్ సైడ్ వెనిగర్ ను తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం పరగుడుపున నిమ్మకాయ నీటిని తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలిం ఉంటుంది. అదే విధంగా నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్య తగ్గాలన్నా, అలాగే మన దరి చేరకుండా ఉండాలన్నా రోజూ 12 నుండి 16 గ్లాసుల నీటిని తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. అదే విధంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు పాలు, పెరుగు, బ్రోకోలీ, క్యాలిప్లవర్, కోడిగుడ్డు తెల్లసొన, క్యాప్సికం వంటి ఆహారాలను తీసుకోవాలి.

వీటితో పాటు అరటిపండ్లు, బొప్పాయి పండు, ఆపిల్, ఖర్బూజ వంటి పండ్లను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. అలాగే సమస్య మరింత కఠినతరం కాకుండా ఉంటుంది. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ ఆహారాలను మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కనుక ఈ ఆహారాలను దూరంగా ఉండడంమంచిది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. అలాగే పాలకూరను కూడా తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసం, చికెన్, గుడ్లు, రెడ్ మీట్, పోర్క్ వంటి వాటిని కూడా తక్కువగా తీసుకోవాలి.

అలాగే స్వీట్ పొటాటో, క్యాబేజి, పల్లీలు, డ్రై నట్స్, టమాట, బీట్ రూట్ వంటి వాటిని కూడా తక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు ఆల్కాహాల్ కు కూడా దూరంగా ఉండాలి. అంతేకాకుండా క్యాల్షియం, మల్టీ విటమిన్స్ వంటి సప్లిమెంట్స్ ను కూడా తీసుకోవడం తగ్గించాలి. అలాగే డార్క్ చాక్లెట్, పంచదార కలిగిప జంక్ ఫుడ్ ను కూడా తీసుకోవడం తగ్గించాలి. ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గడంతో పాటు మన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


close