LIC Scheme: మహిళల కోసం ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్..రూ.29 పెట్టుబడితో రూ.4లక్షల రాబడి..
LIC Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) జీవిత బీమాతో పాటు సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది. మహిళల కోసం కూడా పలు రకాల పథకాలను తీసుకొచ్చింది.
వాటిలో LIC ఆధార్ శిలా యోజన అనే ప్రత్యేక పథకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళలు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. LIC ఆధార్ శిలా యోజన అనేది సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందిస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు గల మహిళలు ఈ స్కీమ్ ఓపెన్ చేయవచ్చు.
ఈ స్కీమ్ మహిళలు ఎంచుకున్న కాలానికి డైలీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మినిమమ్ రూ.75,000, మాగ్జిమమ్ రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కనీస మెచూరిటీ టైమ్ 10 ఏళ్లు, గరిష్ఠ వ్యవధి 20 ఏళ్లు. ఎంచుకున్న వ్యవధి ముగింపులో, పథకం పెట్టుబడి పెట్టబడిన మొత్తాన్ని, బోనస్‌ను తిరిగి చెల్లిస్తుంది. బోనస్ సంవత్సరానికి 4.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు.
* పథకం నుంచి ఎంత సంపాదించవచ్చు?
ఈ స్కీమ్‌లో చేరిన వారు రోజూ చిన్న మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. వయస్సు 30 ఏళ్లు ఉండి 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 పెట్టుబడి పెడితే, ఈ స్కీమ్ టెన్యూర్‌లో మొత్తం రూ.2,11,170 చెల్లించాల్సి వస్తుంది. అయితే, 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.4 లక్షలు లభిస్తాయి. అంటే పెట్టుబడి నుంచి రూ.1.88 లక్షల లాభాన్ని సొంతం చేసుకోవచ్చు.
* పథకంలో ఎందుకు చేరాలి?
ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజన మహిళలకు డబ్బును పొదుపు చేయడానికి, వారి జీవితాలను భద్రపరచుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఈ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరడం సులభం. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా మాత్రమే అవసరమవుతాయి. సౌలభ్యం ప్రకారం మీ ప్రీమియంలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల ప్రకారం పెట్టుబడి మొత్తం, ఫ్రీక్వెన్సీని ఎంచుకోవచ్చు. పథకం సమయంలో ఎప్పుడైనా పెట్టుబడి మొత్తాన్ని లేదా వ్యవధిని కూడా మార్చుకోవచ్చు.
* పథకంలో ఎలా చేరవచ్చు?
8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు మధ్యలో ఆడవారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 70 ఏళ్ల వరకు ఈ స్కీమ్‌లో కాంట్రిబ్యూట్ చేయవచ్చు. LIC ఆధార్ శిలా యోజనలో చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే, LIC బ్రాంచ్ సందర్శించవచ్చు లేదా సమీపంలోని ఏదైనా LIC ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. మరింత సమాచారాన్ని పొందడానికి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి LIC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా LIC యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజన అనేది రోజుకు కేవలం రూ.29 పెట్టుబడితో జీవితాన్ని మార్చే గేమ్-చేంజింగ్ స్కీమ్ అవుతుంది.