Papaya: బొప్పాయి తిన్న తర్వాత మర్చిపోయి కూడా ఈ ఆహారాలు తినకూడదు.. అవేంటంటంటే
చాలా మంది బొప్పాయి తినడానికి ఇష్టపడతారు. కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బొప్పాయి తిన్న తర్వాత మీరు మర్చిపోయి కూడా ఈ పదార్థాలు తినకూడదు. బొప్పాయి తినిన తర్వాత తినకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
బొప్పాయి - నిమ్మకాయ.. బొప్పాయి తిన్న తర్వాత నిమ్మకాయను తినకూడదు. అది ఆరోగ్యానికి చాలా హానికరం. బొప్పాయి, నిమ్మకాయలను కలిపి తినడం మానుకోవాలి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల నీరసం వస్తుంది.
నారింజ - బొప్పాయి ఈ రెండు వ్యతిరేక పండ్లు. నారింజ లేదా బొప్పాయి ఏదైనా ఒకటి తినాలి. బొప్పాయిలు - నారింజ కలిపి తినడం లేదా ఒకదాని తర్వాత ఒకటి తినడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది.
పెరుగు, బొప్పాయి అస్సలు వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి చాలా హానికరం. బొప్పాయి, పెరుగు కలిపి తీసుకుంటే తలనొప్పి, జలుబు, ముక్కు కారటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రెండూ కలిపి తినకూడదు.
బొప్పాయి పోషకాలు పుష్కలంగా ఉండే పండు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బొప్పాయి తర్వాత పాలు తాగకూడదు. బొప్పాయి తిన్న వెంటనే పాలు తాగితే మలబద్ధకం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఈ రెండూ తినాలంటే వాటి మధ్య గంటన్నర గ్యాప్ ఉండాలి.