SBI Personal Loan: Need a loan urgently? This can be obtained from home.. Full details - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

SBI Personal Loan: Need a loan urgently? This can be obtained from home.. Full details

10/26/2023

SBI Personal Loan: Need a loan urgently?  This can be obtained from home.. Full details

SBI Personal Loan: అత్యవసరంగా లోన్‌ కావాలా? ఇలా ఇంట్లో నుంచే పొందొచ్చు.. పూర్తి వివరాలు.

SBI Personal Loan: Need a loan urgently?  This can be obtained from home.. Full details

అత్యవసరంగా డబ్బు అవసరం అయితే మీరు ఏం చేస్తారు? ఎవరిదగ్గరైనా చేబదులు తీసుకుంటారు. లేదా బయట ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీకి అప్పు తెచ్చుకుంటారు. అయితే ఆ వడ్డీ ఎక్కువగా ఉండటంతో ఇటీవల కాలంలో ఎక్కువ మంది బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు క్షణాల్లోనే లోన్లు మంజూరు చేస్తుండటం, బయటకన్నా తక్కువ వడ్డీకే వస్తుండటంతో వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా వినియోగదారులకు ఉపయోగపడుతున్నది పర్సనల్‌ లోన్లు. వీటిని ఆన్‌లైన్‌ లోనే దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉండటం.. తనఖా పత్రాలేవి అవసరం లేకపోవడంతో ఎక్కువమంది వీటిని తీసుకుంటున్నారు. అయితే వీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫేక్‌ లోన్‌ యాప్‌ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇవి సులభంగా లోన్లు మంజూరు చేసి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ జాతీయ బ్యాంకుల్లోనే తీసుకోవడం ఉత్తమం. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద రుణదాత అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పర్సనల్‌ లోన్‌ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ పర్సనల్ లోన్ అర్హత..

ఈ బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు, మీరు బ్యాంక్ ఏర్పాటు చేసిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయం, వయస్సు, ఉద్యోగ స్థితి, మీ క్రెడిట్ స్కోర్ వంటి అనేక అంశాల ఆధారంగా మీకు లోన్లు మంజూరు అవుతాయి.

అర్హతలు ఒకసారి గమనిస్తే..

  • పర్సనల్‌ లోన్‌ కావానుకునే వారు సాధారణంగా, ఎస్‌బీఐ ఖాతాదారుడై ఉండాలి.
  • 21 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • స్థిరమైన ఉద్యోగం, నెలవారీ జీతం ఉండాలి.
  • మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉండాలి.

వినియోగదారులు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో లేదా వారి కస్టమర్ కేర్‌ సంప్రదించడం ద్వారా కచ్చితమైన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయడం మంచిది.

దరఖాస్తు ఇలా చేయాలి..

వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, దానిలో వ్యక్తిగత రుణ విభాగం కోసం వెతకండి.

లోన్‌ ఆప్షన్లు.. దరఖాస్తు చేయడానికి ముందు, కొద్దిగా పరిశోధన చేయడం, అందుబాటులో ఉన్న వివిధ రుణ ఎంపికలను సరిపోల్చడం చాలా అవసరం. వడ్డీ రేట్లు, లోన్ మొత్తాలు, తిరిగి చెల్లించే వ్యవధి, ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాలను పరిగణించండి. ఇది మీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి, మీ అవసరాలకు బాగా సరిపోయే లోన్‌ను ఎంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

దరఖాస్తు చేయాలి..

మీకు సరిపోయే లోన్ ఎంపికను మీరు గుర్తించిన తర్వాత, ‘అప్లై నో’ లేదా ‘ఆన్‌లైన్ అప్లికేషన్’ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ ఓపెన్‌ అవుతుంది. వ్యక్తిగత సమాచారం, ఉపాధి వివరాలు, ఆదాయ వివరాలు, మీరు పొందాలనుకుంటున్న లోన్ మొత్తంతో సహా అవసరమైన అన్ని వివరాలను నింపండి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.. దరఖాస్తు ఫారమ్‌తో పాటు, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు కొన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలలో గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, ఆదాయ రుజువు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, బ్యాంక్ పేర్కొన్న ఏవైనా ఇతర పత్రాలు ఉండవచ్చు.

దరఖాస్తును సమర్పించండి..

ఫారమ్‌ను పూరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, దరఖాస్తును సమర్పించే ముందు వివరాలను జాగ్రత్తగా సమీక్షించండి. తప్పుల కోసం ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. మీరు సంతృప్తి చెందిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.

ఎస్‌బీఐ పర్సనల్‌ లోన్ల రకాలు, వార్షిక వడ్డీ రేట్లు..

ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్ పర్సనల్ లోన్ 11.05%-14.05%

ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ ఎలైట్ స్కీమ్ 11.05%-11.80%

ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్సీ స్కీమ్ 11.30%-14.30%

ఎస్‌బీఐ ఎక్స్‌ప్రెస్ లైట్ స్కీమ్ 12.05%-15.05%

ఎస్‌బీఐ త్వరిత వ్యక్తిగత రుణం 11.30%-14.30%

ఎస్‌బీఐ పెన్షన్ రుణాలు 11.20 % నుంచి ప్రారంభం

ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ఇన్‌స్టా టాప్-అప్ లోన్‌లు 12.15%

close