Silent Walking: What is silent walking? How is it useful for the body? 2023 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Silent Walking: What is silent walking? How is it useful for the body? 2023

10/14/2023

 Silent Walking: What is silent walking? How is it useful for the body?

Silent Walking : సైలెంట్ వాకింగ్ అంటే ఏంటి? శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది?

Silent Walking: What is silent walking? How is it useful for the body? Silent Walking : సైలెంట్ వాకింగ్ అంటే ఏంటి? శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది?

Silent Walking Benefits : వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. కానీ పక్కవారితో మాట్లాడుతూ.., లేదా పాటలు వింటూ చేస్తారు. అయితే దీనికంటే సైలెంట్ వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

వ్యాయామంలో భాగంగా చాలామంది వాకింగ్(Walking) చేస్తుంటారు. రోజూ కనిసం అరగంటైనా నడవాలని వైద్యులు చెబుతారు. దీనితో అనేక లాభాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ముచ్చట్లు పెడుతూ వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ చేస్తారు. ఇలా కాకుండా సైలెంట్ వాకింగ్(Silent Walking) చేస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ సైలెంట్ వాకింగ్ అంటే ఏంటి? దానితో ఉన్న ప్రయోజనాలు ఏంటి?

వాకింగ్ అనగానే.. పద అలా వెళ్లి వద్దాం అనుకుంటూ ఇంకొకరిని వెంట తీసుకెళ్తారు. ఇక వాకింగ్ అయ్యేంత వరకూ వారితో సొల్లు కబుర్లు చెబుతారు. మరికొందరేమో మ్యూజిక్ వింటూ వాకింగ్ చేస్తారు. ఇలా కాకుండా ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్‍కు దూరంగా ఉంటూ చేసే వాకింగ్‍నే సైలెంట్ వాకింగ్ అంటారు. మెుదట 10-15 నిమిషాలు చేయండి. తర్వాత వ్వవధిని పెంచండి.

నేటి బిజీ ప్రపంచంలో మీ మానసిక శ్రేయస్సు కోసం సమయాన్ని వెచ్చించడం కష్టమే. ప్రస్తుతమున్న సమాజంలో ప్రశాంతత అనేది కరువైపోయింది. సైలెంట్ వాకింగ్ చేయడం వలన మెడిటేషన్‍లా ఉపయోగపడుతుంది. మీరు వాకింగ్ చేసినంత సేపు మౌనంగానే ఉండాలి. ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్రస్తుత క్షణం గురించే ఆలోచించాలి. ఏ విషయాలూ మనసులోకి రానివ్వకూడదు. ఈ అభ్యాసం మైండ్‌ఫుల్‌నెస్ కలిగి ఉంటుంది. ఇది ఆందోళనను వదిలించుకోవడానికి మీకు సాయపడుతుంది. 

సైలెంట్‍ వాకింగ్‍తో చాలా ప్రయోజనాలు(Silent Walking Benefits) ఉన్నాయి. అవేంటో చూద్దాం..

మీ శ్వాస, అడుగులపై దృష్టి పెట్టడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు. మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. మీపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. పరిసరాలను బాగా పరిశీలిస్తారు. మనసులోని భయాలు పోతాయి.

సైలెంట్ వాకింగ్ అనేది ఆందోళన ఉండేవారికి ప్రశాంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆందోళనతో కూడిన ఆలోచనల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. నడకపై దృష్టిని మళ్లించడం ద్వారా మీ మీద మీకు నియంత్రణ వస్తుంది.

ఇలాంటి వాకింగ్ చేస్తే.. స్వీయ-అవగాహనను ప్రోత్సహిస్తుంది. మీ ఆలోచనలు, భావాలను స్వేచ్ఛగా అన్వేషించడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోవచ్చు. ఇది మెరుగైన స్వీయ-అవగాహన, భావోద్వేగ నియంత్రణకు దారి తీస్తుంది.

సైలెంట్ వాకింగ్ అనేది మెడిటేషన్‍లాంటిది. ఏకాగ్రత, మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది. ప్రస్తుత క్షణంలో ఉండటానికి మీ మనస్సుకు శిక్షణ ఇచ్చుకోవచ్చు. మీ రోజువారీ దృష్టిని మెరుగుపరుస్తుంది.

సైలెంట్ వాకింగ్ మానసిక స్థితిని పెంచుతుంది. శారీరక వ్యాయామం, మైండ్‌ఫుల్‌నెస్ కలయిక ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. దీనిని ఫీల్-గుడ్ హార్మోన్లుగా చెబుతారు.

వాకింగ్ చేసేవారు ఈ పద్ధతిని పాటించండి. ఆరోగ్యంగా ఉంటారు. మీ గురించి మీరు అన్వేషించుకోవచ్చు. ఇతరులతో మాట్లాడుతూ, లేదంటే ఫోన్లో చూస్తూ.. వాకింగ్ చేయడం కంటే.. ఇలా సైలెంట్ వాకింగ్ చేయడం మంచిది.

close