Star Number Series Notes: RBI's key announcement on those currency notes.. Do you have such notes?
Star Number Series Notes: ఆ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇటువంటి నోట్లు మీ వద్ద ఉన్నాయా?
Star Number Series Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించినప్పటి నుంచి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. పలు రకాల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండేది.
అటువంటి పుకార్లపై కేంద్రం ఎప్పటికప్పుడూ క్లారిటీ ఇస్తూనే ఉంటుంది. తాజాగా కరెన్సీ నోట్లపై మరో పుకారు వైరల్‌గా మారింది. స్టార్ నంబర్ సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నారని.. అవి కొద్దిరోజుల్లో చెల్లుబాటు కావని నెట్టింట ఈ వార్తలు తెగ సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.
స్టార్ నంబర్ సిరీస్ నోట్లపై వార్తలు: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు ఫేక్ ఉంటాయి. అది తెలియక అనేకమంది వీటిని మిగిలిన వారికి షేర్ చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుంటారు. కరెన్సీ నోట్లపై నిత్యం ఇటువంటి వార్తలు వస్తుంటాయి. 2 వేల రూపాయల నోటును ఉపసంహరించుకున్న తర్వాత రూ. 500 నోట్లను కూడా రద్దు చేస్తారంటూ వార్తలు వినిపించాయి.
ఆ వార్తల్లో నిజం లేదంటూ అప్పట్లో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. అయితే స్టార్ నంబర్ సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు ఇటీవల మార్కెట్‌లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటువంటి నోట్లు చలామణిలో లేవని.. స్టార్ నంబర్ సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు ఫేక్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి రంగంలోకి దిగి దీనిపై స్పష్టతనిచ్చింది.
ఫేక్ వార్తలను కొట్టిపడేసిన ఆర్బీఐ: ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నోట్లతో సమానంగానే స్టార్ నంబర్ () సిరీస్‌ను కలిగిన కరెన్సీ నోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ స్టార్ సింబల్ అనేది () బ్యాంక్ సీరియల్ నెంబర్లలో ఉంటుంది. ఆర్బీఐ తాజాగా ముద్రిస్తున్న నోట్లలో ఈ సింబల్ ఉండటం లేదు.
సాధారణంగా ఏవైనా పాత నోట్ల స్థానంలో కొత్తవి రిప్లేస్ చేసినపుడు లేదా రీప్రింటెడ్ నోట్లు అని గుర్తుపెట్టుకోవటం కోసం సదరు కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఈ స్టార్ సింబల్‌ను ప్రింట్ చేస్తుంది. అయితే దీనిపై అవగాహన లేని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. దీంతో కేంద్రానికి చెందిన ఫ్యాక్ట్ చెక్సంస్థ స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు ఫేక్ అని కొట్టి పడేసిన ఆర్బీఐ.. 2016లో జారీ చేసిన 500 నోట్లపై కూడా ఈ స్టార్ సింబల్ ఉంటుందని పేర్కొంది.
స్టార్ నంబర్ సిరీస్ నోట్లపై క్లారిటీ: న్యూమెరికల్స్, ఇంగ్లిష్ లెటర్స్ ప్రిఫిక్స్‌గా ఈ కరెన్సీ నోట్లపై స్టార్ సింబల్‌తో పాటు ఉంటాయి. సీరియల్ నంబర్‌లో ఎప్పుడు 100 నోట్లను ప్రింట్ చేస్తారు. ఇలా చిరిగిన లేదా పునరుద్ధరించిన నోట్లను ప్రత్యేకంగా ముద్రిస్తుంది. ముద్రిస్తున్న నోట్ల కట్టలో 100 కరెన్సీ నోట్లను మాత్రమే ఇలా స్టార్ సిరీస్ ఉండేవాటిని ముద్రిస్తారు.
వీటికి, మిగతా నోట్లకు ఏం తేడా ఉండవని.. కేవలం ఆ నోట్లను పునరుద్ధరించనవిగా గుర్తుపెట్టుకోవటం కోసమే అలా ప్రింట్ చేస్తారని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. అలాగే సోషల్ మీడియా వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై నిజాలు తెలుసుకోకుండా ఇతరులకు షేర్ చేయటం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పింది. కాబట్టి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది.