Success Story: ఒకప్పుడు సిమ్ కార్డులు అమ్మాడు.. కట్ చేస్తే రూ.83 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. అంత డబ్బు ఎలా సంపాదించాడంటే? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Success Story: ఒకప్పుడు సిమ్ కార్డులు అమ్మాడు.. కట్ చేస్తే రూ.83 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. అంత డబ్బు ఎలా సంపాదించాడంటే?

10/08/2023

పాపులర్‌ బిజినెస్‌ షో షార్క్‌ ట్యాంక్‌ ఇండియా (Shark Tank India) పేరు వినే ఉంటారు. ఈ హిందీ రియాలిటీ షోను ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు సపోర్ట్‌ అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు.

ఈ షో ప్యానల్‌లో పొటెన్షియల్‌ ఇన్వెస్టర్లు ఉంటారు. వారు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఐడియాలను, డెవలప్‌ చేయాలనుకుంటున్న ప్రొడక్టులను వింటారు.


న్యూ ఐడియాపై డబ్బును పెట్టుబడి పెట్టాలా? వద్దా? అని నిర్ణయిస్తారు. మొదటి సీజన్‌కు రన్‌విజయ్ సింగ్ హోస్ట్‌గా వ్యవహరించారు, రెండో సీజన్‌కు హాస్యనటుడు రాహుల్ దువా హోస్ట్‌గా మారాడు. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియా థర్డ్‌ సీజన్‌ ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతోంది.


సోనీ లివ్‌లో ప్రసారం కానున్న బిజినెస్‌ రియాలిటీ షో, షార్క్స్ ప్యానెల్‌లో ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ ఉన్నారు. రితేష్ అగర్వాల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సీఈవోలలో ఒకరు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక సవాళ్లను, కష్టాలను అధిగమించారు. రితేష్ జర్నీ, సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.


మధ్యలోనే ఆగిపోయిన చదువు : ఒడిశాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతానికి చెందిన రితేష్ మొదట ఇంజనీరింగ్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాజస్థాన్‌లోని కోటకు వెళ్లాడు. అతని నిజమైన ప్యాషన్‌ ఇంజనీరింగ్ కంటే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఉందని త్వరలోనే గ్రహించాడు. ఢిల్లీలోని ఒక కళాశాలలో తన BSc (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) పూర్తి చేశాడు. ఎకనామిక్స్‌లో ఒక కోర్సులో కూడా చేరాడు. కానీ మొదటి సంవత్సరంలోనే చదువును వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు.


రితేష్ తన కుటుంబానికి ఈ నిర్ణయాన్ని చెప్పలేదు. తన ఖర్చులను కవర్ చేయడానికి సిమ్ కార్డులను విక్రయించడం ప్రారంభించాడు. తన కాలేజ్ డ్రాపౌట్ స్టేటస్‌ను పెట్టుబడిగా పెట్టుకున్నాడు. $100,000(దాదాపు రూ.82 లక్షలు) థీల్ ఫెలోషిప్‌ను పొందాడు. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌ను అందుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఈ ఫెలోషిప్‌ను ప్రధానంగా 20 ఏళ్లలోపు కాలేజీ డ్రాపౌట్‌లకు అందిస్తారు.


మొదటి అడుగు ఫెయిల్యూర్‌! : రితేష్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రయాణం 2013లో ఓరావెల్ స్టేస్ పేరుతో ఒక ఎంటర్‌ప్రైజ్‌తో ప్రారంభమైంది. ఈ స్టార్టప్ ఆలోచన ఓయో రూమ్‌ల మాదిరిగానే ఉంటుంది. అత్యంత సరసమైన బుకింగ్ ధరలతో హోటళ్ల గురించి సమాచారాన్ని అందించింది. అయితే ఈ వెంచర్ సవాళ్లను ఎదుర్కొంది, నిలకడలేనిదిగా మారింది. వైఫల్యానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి, రితేష్ స్వయంగా బడ్జెట్ హోటళ్లలో బస చేసాడు. సమస్య చౌకైన హోటళ్లను కనుగొనడంలో కాదని, కస్టమర్లకు అందించే నాణ్యత, ప్రమాణాలలో ఉందని గ్రహించాడు. కొన్ని మెరుగుదలలతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డాడు. థీల్ ఫెలోషిప్ ఫండ్స్‌ ఉపయోగించి, రితేష్ అగర్వాల్ ఓయో రూమ్‌లను ప్రారంభించాడు. ఈ ఆలోచన భారతదేశంలో బడ్జెట్ హోటల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.


ఇప్పుడు రూ.83 వేల కోట్ల కంపెనీ! : 2015లో ఒక ఇంటర్వ్యూలో రితేష్‌ మాట్లాడుతూ.. 'చిన్న తనంలో బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు కార్టూన్లు చేయలేకపోయేవాడిని. ఎందుకంటే రిమోట్‌ కంట్రోల్‌ నా దగ్గర ఉండేది కాదు. హోటల్‌లో రిమోట్‌ కంట్రోల్‌ మీ చేతుల్లోనే ఉందని, ఇక్కడి నుంచి తక్కువ ధరకే హోటళ్లను అందించాలనే ఆలోచన వచ్చింది' అని తెలిపాడు. ఓయో రూమ్స్ భారతదేశంలోనే కాకుండా చైనాలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని మార్కెట్ విలువ సుమారు $10 బిలియన్లు (సుమారు రూ. 83,000 కోట్లు).