Tech Alert: Google passwords in a new way from now on..2023 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Tech Alert: Google passwords in a new way from now on..2023

10/14/2023

 Tech Alert: Google passwords in a new way from now on..2023

Tech Alert : ఇక నుంచి కొత్త తరహాలో గూగుల్ పాస్ వర్డ్స్..

Tech Alert: Google passwords in a new way from now on..2023 Tech Alert : ఇక నుంచి కొత్త తరహాలో గూగుల్ పాస్ వర్డ్స్..

గూగుల్ పాస్ వర్డ్ లు మారబోతున్నాయి. గూగుల్ వినియోగదారులకు పాస్ వర్డ్ స్థానంలో పాస్ కీలను ప్రవేశపెట్టనుంది. త్వరలో యూజర్లకు  పాస్‌కీలు డిఫాల్ట్ సైన్-ఇన్ పద్ధతిగా ఉంటాయని గూగుల్ వెల్లడించింది. ఈ పాస్‌కీలు.. పాస్‌వర్డ్‌ల కంటే మరింత సురక్షితమైనవిగా గూగుల్ పేర్కొంది. 

ఫేషియల్ రికగ్నిషన్ , ఫింగర్ ప్రింట్, , ప్యాటర్న్,  పిన్‌ని ఉపయోగించి యాప్‌లు, వెబ్‌సైట్‌లకు లాగిన్ అయ్యేలా గూగుల్ యూజర్‌లను అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి  పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.  అయితే పాస్‌వర్డ్‌లు పూర్తిగా నిషేధించలేమని గూగుల్ పేర్కొంది. అయితే యూజర్లు తమ ఖాతాలకు ఓపెన్ చేయడానికి  సాంప్రదాయ పాస్‌వర్డ్‌లను ఉపయోగించవచ్చని సూచించింది.  అయితే పాస్‌కీలను ఉపయోగించకూడదనుకుంటే..  పాస్‌వర్డ్‌ను దాటవేయి  ఎంపికను నిలిపివేయడాన్ని కూడా ఎంచుకోవచ్చని పేర్కొంది.

గూగుల్ పాస్‌కీలను  ప్రవేశపెట్టినప్పటి నుంచి 64 శాతం మంది యూజర్లు  పాస్‌వర్డ్‌లు, ఇతర పద్ధతులతో పోలిస్తే పాస్‌కీలను ఉపయోగించడం చాలా సులభం అని వెల్లడించారు.  పాస్ కీ కావాలంటే g.co/passkeysని సందర్శించాలి. సైన్ ఇన్ చేసిన Android ఫోన్‌ని కలిగి ఉంటే పాస్‌కీలు వాటంతటవే నమోదై  ఉండవచ్చు.

close