తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల ఓపెన్ స్కూల్ సెంటర్ లలో, విద్యా సంవత్సరం 2023-24 కు గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి లేక ప్రవేశం పొందడానికి ఈనెల 13వ తేదీ 13.10.2023 వరకు గడువు పొడిగించినట్లు డిఈఓ సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో చదివేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమీపంలోని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లను సంప్రదించాలని ఆయన సూచనలు చేశారు.చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన యువతకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుంది. రెగ్యులర్ విద్యార్హతలతో సమానంగా ఈ సర్టిఫికెట్ పరిగణలోకి వస్తాయి. వయోజనులు, గృహిణులు, ఎనిమిదవ తరగతి అర్హతతో ఉద్యోగం పొంది ఉన్నవారు, ఇక్కడ ఉన్నత చదువులను అభ్యసించడానికి పదో తరగతి, ఇంటర్ అర్హతల ఉత్తీర్ణత సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసి, రాత పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్ పొందవచ్చు..
రెగ్యులర్ అకాడమిక్ క్రెడిట్ అవకాశాలను అందించడానికి గతంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, సబ్జెక్టులలో ఫెయిల్ అయిన అభ్యర్థులు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్నటువంటి SSC & Intermediate కోర్సుల్లో ప్రవేశం పొంది. మిగిలిన సబ్జెక్టులను ఇక్కడ వారికి అనుగుణంగా ఫీజు కట్టుకొని పాస్ కావడానికి అవకాశాలు కల్పిస్తుంది. అదే విధంగా ఇక్కడ పాసైన అభ్యర్థులకు రెగ్యులర్ అకాడమిక్ క్రెడిట్ అందుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.telanganaopenschool.org/
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న SSC & Intermediate సెంటర్ల వివరాలు :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.