Tradition స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు.. ఇలా చేస్తే భర్తకు మంచిది కాదు..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Tradition స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు.. ఇలా చేస్తే భర్తకు మంచిది కాదు..!

10/31/2023

 స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు.. ఇలా చేస్తే భర్తకు మంచిది కాదు..!

సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది.
వివాహం అయిన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలిమెట్టలను, మంగళ సూత్రాన్ని ధరించడం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది.

ఇక మంగళసూత్రానికి మతపరమైన ప్రాముఖ్యతతో పాటు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది. మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ నల్లపూసలు మరియు దారంతో కట్టి ఉంచుతారు. ఈ నల్ల పూసలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూసలు లేకుండా మంగళసూత్రం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ నల్లపూసలు శివుడు మరియు తల్లి పార్వతి మధ్య బంధాన్ని సూచిస్తాయి. మంగళ సూత్రం అంటే మంగళకరమైన బంధం. పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ఒక ప్రత్యేకమైన, ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం. నిబద్ధతకు, ప్రేమకు, నమ్మకానికి చిహ్నంగా భర్త బ్రతికున్నంత కాలం భార్య మంగళ సూత్రాన్ని ధరించాలని చెబుతారు.

వేదమంత్రోచ్ఛారణలతో, బంధుమిత్రుల, సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మంగళసూత్రాన్ని ధరించడం వలన అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మంగళసూత్రంలోని బంగారం పార్వతి తల్లికి ప్రతీకగా, నల్ల పూసలు శివునికి ప్రతీక అని నమ్ముతారు. వివాహిత స్త్రీలు తప్పనిసరిగా మెడలో మంగళసూత్రాన్ని ధరించాలి. కొన్ని కారణాల వల్ల స్త్రీ మంగళసూత్రం ధరించడం మరచిపోతే, ఆమె తప్పనిసరిగా నల్ల దారం ధరించాలి.

అయోధ్య జ్యోతిష్కుడు పండిట్ కల్కి రామ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో మంగళసూత్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది అని తెలిపారు. అయితే వివాహిత భర్త చనిపోతే ఆ వివాహిత ఆమె మెడలోని మంగళసూత్రాన్ని తీసేస్తారు. అంతే కాకుండా మంగళసూత్రాన్ని ఎప్పుడు తీసివేయాలి అనే ప్రస్తావన ఏ మత గ్రంథంలోనూ లేదు. అసలు మంగళ సూత్రాన్ని మెడ నుండి తియ్యకుండా ఉండడమే మంచిదని చెప్తున్నారు. మంగళ సూత్రంలో గుచ్చే నల్లపూసలలో దైవ శక్తి ఉంటుంది. అది ఆ జంటను నరదృష్టి నుండి కాపాడుతుంది. భర్తకు పరిపూర్ణమైన ఆయుష్షును ఇస్తుంది. కనుక భర్త ఆయుష్షు కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలో ఉంచుకోవాలి. మంగళసూత్రం పోయిన విరిగిపోయిన అరిష్టంగా చెబుతారు.

మంగళసూత్రం విషయంలో కొందరు మహిళలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది మహిళలు మంగళ సూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నిసులు పెడుతూ ఉంటారు. అయితే వేదమంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని, అలా పెడితే భర్త ఆయుష్షు మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా తెలిసీ తెలియక అలా చేస్తే తప్పక తప్పు అని చెప్పి వాటిని మంగళసూత్రం నుండి వేరు చెయ్యాలని చెప్తున్నారు.

అంతేకాదు మంగళసూత్రం స్త్రీల హృదయం వద్ద ఉంటుంది. కాబట్టి హెయిర్ పిన్నులు, పిన్నిసులు మంగళ సూత్రంలో ఉన్న దివ్యమైన శక్తిని ఆకర్షించి భర్తను శక్తిహీనుడుగా చేస్తాయని, దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుందని చెబుతారు. అంతేకాదు భార్యాభర్తల పట్ల ఒకరికి ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గుతుందని చెబుతారు. కనుక పొరపాటున కూడా మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నిసులు పెట్టకూడదని సూచిస్తున్నారు.



close