Viral 15 ఏళ్లుగా డబ్బులేకుండా జీవిస్తున్న వ్యక్తి.. ఎలా సాధ్యమైందంటే.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Viral 15 ఏళ్లుగా డబ్బులేకుండా జీవిస్తున్న వ్యక్తి.. ఎలా సాధ్యమైందంటే..

10/07/2023

 15 ఏళ్లుగా డబ్బులేకుండా జీవిస్తున్న వ్యక్తి.. ఎలా సాధ్యమైందంటే..

ఈ రోజుల్లో ప్రతీ అంశం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అది లేకుండా జీవించడం అసాధ్యం. కానీ యూకేకు చెందిన మార్క్ బాయిల్ అనే వ్యక్తికి మాత్రం ఇది సాధ్యమైంది.
మనీ లేకుండా కూడా సంతోషంగా జీవించవచ్చునని నిరూపించాడు. 2008 నుంచే అతను డబ్బు లేని జీవనశైలిని గడుపుతున్నాడు. టెక్నాలజీని కూడా పూర్తిగా విస్మరించాడు. చాలా సింపుల్‌గా ప్రకృతి ద్వారా అందే పండ్లు, కాయగూరలను మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. వాస్తవానికి మార్క్ అంతకు ముందు బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌ డిగ్రీలో కళాశాల పట్టా పొందాడు. ఆ తర్వాత యూకే బ్రిస్టల్‌లోని ఒక ఆర్గానిక్ ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో కూడిన జాబ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా జీవిస్తున్నాడు. ఎటువంటి హంగూ ఆర్బాటాలు, డబ్బు లేకుండా సింపుల్‌గా గడుపుతున్నాడు.

వాస్తవానికి 2007లో మార్క్ బాయిల్‌లో మార్పు ప్రారంభమైంది. అప్పట్లో ఒకరోజు రాత్రి అతని హౌస్‌బోట్‌లో గ్లాస్ ఆఫ్ మెర్లాట్ అనే ఒక ఫిలాసపర్‌తో ఏర్పడిన పరిచయం అతన్ని పూర్తిగా మార్చి వేసింది. ఫ్రెండ్లీ సెషన్‌లో వారు ప్రపంచ సమస్యల గురించి చర్చించారు. చాలా సమస్యలకు మూలం డబ్బేనని 
అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మార్క్ బాయిల్‌కు ''Be the change you want to see in the world'' అనే గాంధీజీ కొటేషన్ గుర్తుకొచ్చింది. ఓ వైపు ఫిలాసఫర్‌ ఆలోచన, మరోవైపు గాంధీజీ కొటేషన్ అతన్ని చాలా ప్రభావితం చేశాయి. అప్పటి నుంచే డబ్బులేకుండా జీవించాలని నిర్ణయించుకున్న మార్క్ తన ఖరీదైన హౌస్‌బోట్‌ను విక్రయించి, పాత కారవాన్‌లోకి మారాడు. ఈ కారవాన్ కూడా డబ్బుతో కొనలేదు. అతని మార్పును చూసి ఎవరో విరాళంగా ఇచ్చారట. ఇక అప్పటి నుంచి మనీలెస్ లైఫ్‌ను ఎంతో నిబద్ధతతో కొనసాగిస్తున్నాడు. ఉదయం పూట కప్పు కాఫీతో మొదలయ్యే అతని దినచర్య, ప్రకృతి నుంచి ఉచితంగా పొందగలిగే ఆహారాలతో కొనసాగించాల్సి వచ్చినందుకు ప్రారంభంలో కొంత ఇబ్బంది పడ్డాడు. తర్వాత అలవాటు పడ్డాడు. డబ్బు లేకుండా జీవిస్తున్న మార్క్ బాయిల్ 2010లో 'ది మనీలెస్ మ్యాన్‌' అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఇందులో అతను తనలో వచ్చిన పరివర్తన, ఎదుర్కొన్న ఇబ్బందులతోపాటు, కొత్తగా కనుగొన్న ఆచరణాత్మక పరిష్కారాల గురించి, అలాగే తత్వశాస్త్రం గురించి వివరంగా చెప్పాడు.