14 తరాలుగా ఓ సామాన్యుడి పేరే పెట్టుకుంటున్న రాజవంశీయులు కారణం తెలుసా ?? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

14 తరాలుగా ఓ సామాన్యుడి పేరే పెట్టుకుంటున్న రాజవంశీయులు కారణం తెలుసా ??

11/08/2023

 14 తరాలుగా ఓ సామాన్యుడి పేరే పెట్టుకుంటున్న రాజవంశీయులు కారణం తెలుసా ??

మనిషన్నాక మాటమీద నిలబడాలి అనే మాటలు మనం అప్పుడప్పుడూ వింటూంటాం. ఒకప్పుడు మాటకు ఎంత విలువ ఉండేదో ఓ రాజకుటుంబం ఇప్పటికీ చాలిచెబుతోంది.
ఇచ్చిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్న ఈ రోజుల్లో కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడికి ఇచ్చిన మాటకు ఓ రాజవంశం కట్టుబడి జీవిస్తోంది. వారి సంస్థానం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నందుకు కృతజ్ఞతగా వారి వంశంలో ప్రతి ఒక్కరికి అతని పేరు పెట్టుకుంటున్నారు.. ఆ సామాన్యుడి ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాతే ఈ రాజవంశంలో శుభకార్యాలు జరుపుకుంటున్నారు. అదే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి రాజాల సంస్థానం. ప్రస్తుతం ఈ వెంకటగిరి ఒక నియోజవర్గం కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ పట్టణం ఈ వెంకటగిరి. ఒకప్పుడు వెంగటగిరి సంస్థానంగా వెంగటగిరి రాజాలు పరిపాలించేవారు. దశాబ్దాల క్రితం ఆ సంస్థనానికి శత్రు రాజ్యం నుంచి ప్రమాదం ఏర్పడింది. యుద్ధం జరిగే సమయంలో శత్రువులను ఓడించేందుకు రాజ్యంలోని కాంపాలెం అనే హరిజనవాడకు చెందిన యాచడు అనే వ్యక్తి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. అందుకు ప్రతిగా అప్పటి వెంకటగిరి సంస్థానాన్ని పాలిస్తున్న రాజు.. ఆ సమయంలో యాచడిని నీకు ఏం కావాలో కోరుకో తీరుస్తానని మాటిచ్చారు.


close