రూ.456తో 4 లక్షలు ప్రయోజనం.. మోదీ సర్కార్ స్కీమ్.. పూర్తి వివరాలు.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

రూ.456తో 4 లక్షలు ప్రయోజనం.. మోదీ సర్కార్ స్కీమ్.. పూర్తి వివరాలు..

11/05/2023

 రూ.456తో 4 లక్షలు ప్రయోజనం.. మోదీ సర్కార్ స్కీమ్.. పూర్తి వివరాలు..

కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేయటంతో పాటు కొన్ని ఆర్థిక పాఠాలను సైతం నేర్పించింది. దీంతో చాలా మంది ప్రజలు తమ బీమా అవసరాలను గ్రహిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని వినియోగించుకుంటున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY) గురించి. ప్రధాని నరేంద్ర మోదీ తన మొదటి టర్మ్‌లో ప్రజల ఇన్సూరెన్స్ అవసరాలను సరసమైన ధరకు అందించేందుకు రెండు పథకాలను ప్రారంభించారు. ఇందులో ఒకటి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, రెండవది ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). వీటి ద్వారా దేశంలోని ప్రజలు నామమాత్రపు ఖర్చుతో రూ.4 లక్షల వరకు బీమా రక్షణను పొందేందుకు వెసులుబాటు కల్పించబడింది.

ఇందులో ఏ కారణంగానైనా వ్యక్తి మరణిస్తే వారికి ఏడాదిలో రూ.4 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అందిస్తుంది. దీనిని ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రతి సంవత్సరం ఈ ప్లాన్‌ని పొడిగించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా ఉన్న 18-50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కీమ్ కింద నమోదైన వ్యక్తికి రూ.2 లక్షలు కవరేజ్ లభిస్తుంది. ఈ పథకం కింద ప్రతి ఏడాది కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంటుంది.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద ఏడాది పాటు ప్రమాద బీమా అందించబడుతోంది. పాలసీదారు మరణించినా లేక వైకల్యానికి గురైనా వారికి స్కీమ్ కింద కవరేజ్ అందించబడుతుంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు వయస్సు కలిగిన వ్యక్తులు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందేందుకు అర్హులు. కేవలం ఏడాది రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల వరకు బీమా కవరేజ్ అందించబడుతుంది. పథకం కింద ఖాతాదారు ఏకమొత్తం ఆదేశం ఆధారంగా ప్రతి సంవత్సరం కస్టమ్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది.


close