రైతులకు శుభవార్త..ఈ నెల 7న వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

రైతులకు శుభవార్త..ఈ నెల 7న వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల

11/05/2023

 రైతులకు శుభవార్త..ఈ నెల 7న వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa funds : ఏపీ రైతులకు శుభవార్త అందించింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 7న వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఈ నెల 7న సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనకు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

 YSR Rythu Bharosa funds will be released on 7th of this month
ఇందులో భాగంగానే ఎల్లుండి ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా పుట్టపర్తి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌… వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక అదే రోజున మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


close