Are you putting money in the bank in the name of the child? This Income Tax can be complicated.. Check it out! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Are you putting money in the bank in the name of the child? This Income Tax can be complicated.. Check it out!

11/03/2023

Are you putting money in the bank in the name of the child?  This Income Tax can be complicated.. Check it out!

పిల్లల పేరుపై బ్యాంకులో డబ్బులేస్తున్నారా? ఈ Income Tax చిక్కులు రావొచ్చు.. చూసుకోండి!

Are you putting money in the bank in the name of the child?  This Income Tax can be complicated.. Check it out!

Income Tax: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి భవిష్యత్తు ఖర్చుల కోసం వారి పేరుపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే, అందులో చాలా మందికి పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టినప్పుడు ఎదురయ్యే ఆదాయపు పన్ను చిక్కులపై పెద్దగా అవగాహన ఉండదని పలు నివేదికలు చెబుతున్నాయి.

మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు ఇలా చాలా మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మైనర్ల పేరుపై మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, ఆ పెట్టుబడి ప్రాసెస్ అనేది ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్‌లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదని కేఫిన్‌టెక్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సెంథిల్ జీ పేర్కొన్నారు. అయితే, మైనర్ల పేరుపై బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఇన్‌కమ్ ట్యాక్స్ చిక్కుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్యాంకు ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి చిక్కులు వస్తాయి?

చాలా మంది తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల పేరుపై బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. అలాగే వివిధ రకాల పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే, సాధారణ ప్రజలపై ఆదాయపు పన్ను ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు కానీ, అధిక ఆదాయం గల తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా సంపాదించే తల్లిదండ్రుల ఆదాయంలో పిల్లల పేరుపై చేసే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్టాఫీసు పథకాల్లోని పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కలిపి లెక్కిస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం. వడ్డీ పెరిగిందా లేదా చెల్లించారా అనేది పట్టించుకోరు. పిల్లలు మేజర్ అయిన తర్వాత వడ్డీ చెల్లింపులు చేసినప్పటికీ ఎక్కువగా సంపాదించే తల్లిదండ్రుల ఆదాయంలో ఆ వడ్డీని కలుపుతారు.

అయితే, ఇలా పిల్లల పేరుపై చేసిన పెట్టుబడి వడ్డీని తల్లిదండ్రుల ఆదాయంలో కలిపినప్పటికీ కొన్ని పన్ను మినహాయింపులు కల్పిస్తోంది ఇన్‌కమ్ ట్యాక్స విభాగం. ఒక ఆర్థిక ఏడాదిలో ఇద్దరు పిల్లలకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, ట్విన్స్ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇప్పటికే ఒక బాబు ఉండగా రెండోసారి ట్విన్స్ జన్మించినప్పుడు కూడా ఇద్దరికే మినహాయింపు వర్తిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 10(32) కింద మైనర్ల ఆదాయం కలిసిన తల్లిదండ్రులు రూ. 1,500 లేదా పిల్లల పెట్టుబడి పై వచ్చే ఆదాయంలో ఏది తక్కువ ఉంటే అది క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, పాత పన్ను విధానంలో మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.. కొత్త పన్ను విధానం ఎంచుకున్న తల్లిదండ్రులకు ఇది వర్తించదని గుర్తుంచుకోవాలి.

close