Ayyappa swami అయ్యప్ప స్వామి కాళ్లకు బంధం ఎందుకుంటుందో తెలుసా.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Ayyappa swami అయ్యప్ప స్వామి కాళ్లకు బంధం ఎందుకుంటుందో తెలుసా..

11/04/2023

 Ayyappa swami అయ్యప్ప స్వామి కాళ్లకు బంధం ఎందుకుంటుందో తెలుసా..

హిందూ దేవుళ్లకు ఎంతో చరిత్ర ఉంటుంది. అయ్యప్ప స్వామి విశిష్టత గురించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి మహిమ కోసం అయ్యప్ప స్వామి భక్తులు..
అయ్యప్ప మాల వేసుకుంటారు. దాదాపు 40 రోజులు కఠోర దీక్ష చేపడతారు. నిష్టతో ఉంటారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలకు వెళ్లి తమ దీక్షను తొలగించి.. స్వామిని వేడుకొని వస్తారు.అయితే.. అయ్యప్ప స్వామి కాళ్లకు బంధనం ఉంటుంది తెలుసా? ఆయన కాళ్లకు ఉన్న పట్టిలను ఎప్పుడైనా గమనించారా? అసలు అవి ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక పెద్ద కథే ఉంది.. అదేంటో తెలుసుకుందాం ...

అయ్యప్పస్వామి గురించి పూర్తిగా తెలిసిన వాళ్లకు పట్టి గురించి కూడా తెలిసే ఉంటుంది. అయ్యప్ప స్వామి పందల రాజు వద్ద చాలా ఏళ్లు పెరిగాడు. దాదాపు 12 ఏళ్లు పందల రాజు వద్దే ఉన్నాడు. ఆ తర్వాతే తాను హరిహరసుతుడను అని తెలుసుకుంటాడు అయ్యప్ప. అయితే.. ధర్మాన్ని గెలిపించడం కోసమే తాను జన్మించానని.. తాను హరిహరసుతుడను అని అయ్యప్ప నారద మహర్షి ద్వారా తెలుసుకుంటాడు. వెంటనే మహిషిని ఆవహిస్తాడు అయ్యప్ప. ఆ తర్వాతే శబరిమల ఆలయంలో జ్ఞానపీఠంపై అధిష్ఠిస్తాడు.
అదే సమయంలో 18 మెట్ల మీద కూర్చొని ఉన్న అయ్యప్ప స్వామిని చూడటానికి అప్పుడే పందల రాజు వస్తాడు. రాజు రాగానే అయ్యప్ప స్వామి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడే పట్టు తప్పి అయ్యప్ప స్వామి కిందపడిపోతాడు. దీంతో పందల రాజు ఆయ్యప్ప స్వామి కాళ్లకు పట్టీలు కడుతాడు. దీంతో స్వామి కిందపడడు. ఎప్పుడూ నువ్వు ఈ పట్టీలు వేసుకొని ఉండాలి అని పందల రాజు.. అయ్యప్ప స్వామికి చెబుతాడు. దీంతో అప్పటి నుంచి అయ్యప్ప స్వామి.. పట్టీలు వేసుకొని ఉంటాడు. ఇది అయ్యప్ప స్వామి కాళ్లకు బంధం ఉన్న రహస్యం... .


close