Best cars కొత్త కారు కొనడానికి ఇదే సరైన సమయం.. రూ. 10 లక్షల లోపు ధరలో 27 కి.మీ మైలేజ్‌ ఇచ్చే మూడు బెస్ట్‌ కార్లు ఇవే.!! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Best cars కొత్త కారు కొనడానికి ఇదే సరైన సమయం.. రూ. 10 లక్షల లోపు ధరలో 27 కి.మీ మైలేజ్‌ ఇచ్చే మూడు బెస్ట్‌ కార్లు ఇవే.!!

11/08/2023

 కొత్త కారు కొనడానికి ఇదే సరైన సమయం.. రూ. 10 లక్షల లోపు ధరలో 27 కి.మీ మైలేజ్‌ ఇచ్చే మూడు బెస్ట్‌ కార్లు ఇవే.!!

పండుగ సీజన్‌ వచ్చిందంటే కొత్త కారు కొనాలని చాలా మంది ప్లాన్‌ చేస్తుంటారు. ముఖ్యంగా దీపావళి సీజన్‌లో కొత్త కారు మోడళ్లతో పాటు.. ప్రస్తుతం ఉన్న కార్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి.
ఈ క్రమంలో పండుగ సందర్భంగా కారు కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం. రూ. 10 లక్షల ధరలో సేఫ్టీ పరంగా, మైలేజ్‌ పరంగా మూడు ది బెస్ట్‌ SUV ల గురించి ఇక్కడ అందిస్తున్నాం.

Tata Punch: స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్ దేశంలోనే అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ SUV గా గుర్తింపు సాధించింది. గ్లోబల్‌ NCAP లో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మార్కెట్లో దీని ధర రూ. 6 లక్షల నుంచి ఉంది. టాప్‌ వేరియంట్‌ ధర రూ. 9.52 లక్షలు (ఎక్స్-షోరూమ్).

 

టాటా పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 88 bhp శక్తిని, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ పరిమాణంలో చిన్నదిగా కనిపించినా.. ఇందులో ఐదుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు. 366 లీటర్ల బూట్ స్పేస్, 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. టాటా పంచ్‌ పెట్రోల్ వెర్షన్ 20.09 kmpl, CNG 26.99 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది.

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా బేస్ వేరియంట్ ధర రూ. 8.29 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎక్స్‌ షో రూమ్‌ ధర. మారుతి బ్రాండ్‌లోని అన్ని కార్లలో అత్యంత సురక్షితమైన కారుగా బ్రెజ్జా గుర్తింపు పొందింది. అంతే కాకుండా గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

బ్రెజ్జా ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది 19.8 kmpl మైలేజ్‌ని, CNG వెర్షన్ 25.51 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను చూడవచ్చు.

Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ నుంచి విడుదలైన ఎక్స్‌టర్ బేస్‌ ధర రూ. 6 లక్షలుగా ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఫీచర్-రిచ్ SUVని కొనుగోలు చేయాలనుకునేవారికి Xter బెస్ట్‌ ఆప్షన్‌. ఎందుకంటే ఈ కారులో 60కి పైగా కనెక్ట్ చేయబడిన అధునాతన ఫీచర్లను చూడవచ్చు.

 

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 81 బిహెచ్‌పి పవర్ వద్ద 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని CNG వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్ వేరియంట్‌లో 19.4kmpl మైలేజ్‌ ఇవ్వగా CNGలో 27.1 km/kg మైలేజ్‌ ఇస్తుంది.

ఇక హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌లో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యూయల్ కెమెరా డాష్‌క్యామ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, TPMS, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో ప్రవేశపెట్టారు. పండుగ సీజన్‌లో బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ కారు కొనుగోలు చేయాలనుకునేవారికి మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌, హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి.


close