Best Cars: ఏడుగురు ప్రయాణించే కొత్త కారు రూ.8 లక్షలకే.. అప్డేట్ ఫీచర్స్.. ఆకట్టుకునే డిజైన్..అవెంటో తెలుసుకోండి
Best Cars: కుటుంబంలోని వారంతా బయటకు వెళ్లాలంటే బైక్ పై వెళ్లడం సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా వెహికల్ ను రెంట్ కు తీసుకోవాలి. అయితే ప్రతీసారి ఇలా అద్దెకు తీసుకోవడం ఆర్థికంగా నష్టం చేకూర్చే పని.
అందువల్ల చాలా మంది సొంతంగా వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారు సాధారణంగా కాకుండా కనీసం 7గురు ప్రయాణించే వాటి కోసం ఎదురుచూస్తున్నారు. 7 సీటర్ కారైన తక్కువ ధరకు లభించే కొన్ని మోడళ్లు ఉన్నాయి. ఇవి తక్కువ ధరకు రావడమే కాకుండా అప్డేట్ ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఆ కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా?
మారుతి నుంచి డిఫరెంట్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చి రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిలో 7 సీటర్ ఎర్టిగా, బ్రెజ్జా బెస్ట్ మోడల్స్ గా నిలిచాయి. ఎర్టిగా పెట్రోల్ తో పాటు 4 సిలిండర్లతో కూడుకొని ఉంది. ఇది 101.65 బీహెచ్ పీ పవర్ తో 136.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 45 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు ఉంది. లీటర్ పెట్రోల్ కు 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు 6 స్పీడ్ గేర్ బాక్స్, 5 డోర్స్ సౌకర్యం ఉన్నాయి. ఇందులో 7గురు సురక్షితంగా ప్రయాణం చేయొచ్చు. దీనిని రూ.8.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
నేటి కాలంలో విహార యాత్రలకే కాకుండా చిన్న చిన్న అవసరాలకు ఇతర టూర్లకు వెళ్లడానికి కారును కలిగి ఉంటున్నారు. ఈ తరుణంలో 5 సీటర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే మారుతి నుంచి బ్రెజ్జా 5 సీటర్ సేమ్ ఫీచర్స్ కలిగి రూ.8.29 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో బ్రెజ్జా కంటే ఎర్టిగా బెటరని కొందరు భావిస్తున్నారు. ఫీచర్స్ కూడా సరిసమానంగా ఉండడంతో ఎక్కువ శాతం ఎర్టిగా వైపే మొగ్గు చూపుతున్నారు.