ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు

11/09/2023

 ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు.

పిల్లలకు చిప్స్, కుర్ కురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చే కన్నా ఇలాంటి ప్రోటీన్ లడ్డూను స్నాక్స్ గా ఇస్తే ఎంతో మంచిది. వారిలో ఎలాంటి ప్రోటీన్ లోపం రాకుండా ఈ ప్రోటీన్ లడ్డు అడ్డుకుంటుంది.
అంతేకాదు వారికి నిరంతరం శక్తిని అందిస్తుంది. ఆటలు ఆడినా వారు త్వరగా అలసిపోరు. చదువులో కూడా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచేందుకు ప్రోటీన్ లడ్డు ఎంతో సహకరిస్తుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీనిలో బెల్లం వాడతారు. కాబట్టి ఐరన్ లోపం కూడా రాకుండా ఉంటుంది. దీన్ని పిల్లలకు అలవాటు చేస్తే శారీరకంగా, మానసికంగా వారు ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతారు.

కావాల్సిన పదార్థాలు 
నువ్వులు - అరకప్పు 
పిస్తా - రెండు స్పూన్లు 
వేరుశెనగ గింజలు - అరకప్పు 
బాదం పప్పులు - పది 
గుమ్మడి గింజలు - రెండు స్పూన్లు 
అంజీర్ - నాలుగు 
ఖర్జూరాలు - నాలుగు 
బెల్లం - కప్పున్నర 
ఎండు కొబ్బరి - అరకప్పు
యాలకుల పొడి - ఒక స్పూను 
నీళ్లు - తగినంత

తయారీ ఇలా
బాదం, పిస్తా పప్పులను సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశనగపప్పులు, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే బాదం పిస్తా తరుగును కూడా ఒకసారి వేయించి తీసేయాలి. అందులో ఎండు కొబ్బరిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కళాయిలో బెల్లం నీళ్లు వేసి తీగపాకాన్ని తీయాలి. ఈ లోపు అంజీర్, ఖర్జూరాన్ని చిన్నగా తరుగాలి. బెల్లం తీగ పాకం రాగానే స్టవ్ కట్టేయాలి. యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ అందులో వేసి బాగా కలపాలి. అది గోరువెచ్చగా అయ్యేదాకా వదిలేసి తరువాత ఆ పప్పులను బెల్లంతో కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే ప్రోటీన్ లడ్డు సిద్ధమైనట్టే.
ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. ఇది శరీర కండర ద్రవ్యరాశికి అవసరం. అలాగే కొవ్వులు పేరుకుపోకుండా అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుంది. అథ్లెట్లకు ప్రోటీన్ చాలా అవసరం. ప్రొటీన్లు లోపం వస్తే శరీరం చాలా నీరసపడిపోతుంది. కండరాలు, ఎముకలు నిర్మించడానికి అవసరమైన హార్మోన్లు ఎంజైమ్కి ప్రోటీన్ ముఖ్యం. మన శరీరంలో ముఖ్యమైన శక్తి వనరు ప్రోటీనే. ఈ లడ్డూలో వాడిన అన్ని పప్పుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ లడ్డు తినడం వల్ల ఐరన్ లోపం కూడా రాదు. ఎందుకంటే బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా రక్తహీనత సమస్య బారిన పడుతూ ఉంటారు. ఈ లడ్డు తినడం వల్ల ప్రోటీన్ లోపం కానీ ఇనుములోపం కానీ రాదు. కాబట్టి రక్తహీనత సమస్య వచ్చే అవకాశమే లేదు. అంతే కాదు వారు చురుగ్గా, బలంగా ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రోటీన్ లడ్డూను రోజుకు ఒకటి తినిపించడానికి ప్రయత్నించండి. ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్లు తాగడం కన్నా ఇలాంటి ప్రోటీన్ లడ్డూలు తయారు చేసుకొని తినడం వల్లే ఎక్కువ ఉపయోగం.


close