Business Ideas: Start a business with Rs. 5 thousand.. Central government is encouraging.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Business Ideas: Start a business with Rs. 5 thousand.. Central government is encouraging..

11/03/2023

Business Ideas: Start a business with Rs. 5 thousand.. Central government is encouraging..

Business Ideas: రూ.5 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి.. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం..

Business Ideas: Start a business with Rs. 5 thousand.. Central government is encouraging..

Business Ideas: తక్కువ పెట్టుబడితో రోజూ ఆదాయం పొందే వ్యాపారాలను ప్రారంభించాలని అనేక మంది చూస్తున్నారు. ఒకరి కింద ఉద్యోగం చేయటం కంటే టెన్షన్ లేకుండా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశం..

ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది 'ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం' ఏర్పాటు గురించి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. వీటి ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి దేశంలో పాపులర్ కావటంతో అనేక చోట్ల వీటి ఏర్పాటుతో సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

దేశంలో కొత్తగా 2000 స్టోర్ల ఏర్పాటుకు కేంద్ర ఆమోదించగా.. వీటిలో 1,000 కేంద్రాలు ఆగస్టు 2023 నాటికి, మిగిలినవి డిసెంబర్ చివరినాటికి తెరవబడతాయి. 1800 రకాల మందులు, 285 వైద్య పరికరాలను బయటి కంటే 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ధరలకు లభించటంతో ప్రజాధరణ పొందుతున్నాయి.

మీరు మీ ప్రాంతంలో ఈ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం రూ.5000లతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం బీ-ఫార్మసీ లేదా డీ-ఫార్మసీ పట్టా తప్పనిసరి. అలాగే షాపు ఏర్పాటుకు 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. కేంద్రాన్ని తెరచిన తర్వాత రూ.5 లక్షల వరకు లేదా నెలకు గరిష్ఠంగా రూ.15 వేలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. అలాగే నెలవారీ మందుల కొనుగోళ్లపై 15 శాతం ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేక కేటగిరీలు లేదా ప్రాంతాల్లో అవస్థాపన ఖర్చులకు రీయింబర్స్‌మెంట్‌గా ప్రభుత్వం అదనపు ప్రోత్సాహక మొత్తంగా రూ.2 లక్షలను ఒకేసారి అందజేస్తుంది.

ఈ దుకాణం ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఆధార్ కార్డ్, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, నివాస ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. janaushadhi.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా PM జన్ ఔషధి కోసం దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ఇలా మీరు నివసించే ప్రాంతంలోనే తక్కువ పెట్టుబడితో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే మందుల షాపును ఏర్పాటు చేసుకోవచ్చు.

close