Car Steering Right Way: చాలామంది కారు స్టీరింగ్‌ని తప్పుగా పట్టుకుంటారు.. ఈ తప్పు మీరు కూడా చేస్తున్నారా..!
Car Steering Right Way: ఇప్పటికీ చాలామంది కారు స్టీరింగ్‌ని సరిగ్గా పట్టుకోలేరు. తప్పుగా తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతారు. బహుశా.. వారికి సరైన పద్దతి తెలియకపోవచ్చు.
కారు స్టీరింగ్ వీల్ ఒక గడియారం అనుకుంటే అందులో 9 గంటలు ఉన్న చోట ఎడమ చేతిని, 3 గంటలు ఉన్న చోట కుడి చేతిని పెట్టి స్టీరింగ్ వీల్ కంట్రోల్ చేయాలి. ఇలా పట్టుకోవడం సురక్షితమైనది దీనివల్ల మీరు స్టీరింగ్‌పై మెరుగైన నియంత్రణ కలిగి ఉంటారు.
ఈ స్థానం చాలా సురక్షితమైనది ఎందుకంటే ఈ స్థితిలో కారును వేగంగా, సులభంగా నడపడానికి అవకాశం ఉంటుంది. మీ మణికట్టు, చేతులపై ఎక్కువ భారం పడదు. స్టీరింగ్‌ని తప్పుగా పట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మణికట్టు, చేతులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. స్టీరింగ్‌ని ఏ విధంగా పట్టుకోకూడదో తెలుసుకుందాం.
ఒక చేత్తో స్టీరింగ్‌ని పట్టుకోవడం అస్సలు చేయకూడదు.
రెండు చేతులను 10, 2 గంటల స్థానంలో ఉంచకూడదు.
రెండు చేతులను 4, 8 గంటల స్థానంలో ఉంచడం మంచిది కాదు.
స్టీరింగ్ వీల్‌ను గట్టిగా పట్టుకోకూడదు.
స్టీరింగ్ వీల్‌ను చాలా వదులుగా పట్టుకోకూడదు.
కారు స్టీరింగ్‌ని పట్టుకునే పద్దతులు
ఎల్లప్పుడూ స్టీరింగ్ వీల్‌ని రెండు చేతులతో పట్టుకోవాలి.
రెండు చేతులను 9, 3 గంటల స్థానంలో ఉంచాలి.
స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవద్దు. అలాగని వదులుగా ఉంచవద్దు.
అనవసరంగా స్టీరింగ్‌ని పదే పదే తిప్పవద్దు.
మీరు రన్నింగ్‌లో వేగంగా తిరుగుతుంటే స్టీరింగ్ వీల్‌ని రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి.