Credit Card: Have you put your credit card aside? This is what happens.. Find out for sure! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Credit Card: Have you put your credit card aside? This is what happens.. Find out for sure!

11/01/2023

Credit Card: Have you put your credit card aside?  This is what happens.. Find out for sure!

Credit Card: క్రెడిట్ కార్డు వాడకుండా పక్కన పడేశారా? జరిగేది ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి!

Credit Card: Have you put your credit card aside?  This is what happens.. Find out for sure!

Credit Card: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. ఒకటికి మించి కార్డులు వాడుతున్నారు. రెండు, మూడు కార్డులు ఉన్నప్పుడు మంచి ఆఫర్లు వచ్చే కార్డును వినియోగిస్తూ.. మిగిలిన వాటిని వాలెట్‌లో అలాగే ఉంచేస్తారు. కొందరు క్రెడిట్ కార్డు తీసుకుని యాక్టివేట్ చేసిన తర్వాత వాడకుండా ఉంటారు. దీని ద్వారా వెంటనే ఎలాంటి ప్రభావం పడకపోయినా.. మీకు వచ్చే రివార్డు పాయింట్లు కోల్పోవడం, మంచి క్రెడిట్ స్కోరును బిల్డ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. అంతే కాదు ఇంకా చాలా వరకు నష్టాలు ఉన్నాయి. ఎవరైతే క్రెడిట్ కార్డును వాడకుండా పక్కన పెట్టేస్తారో వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.

క్రెడిట్ స్కోరుపై ప్రభావం..

క్రెడిట్ కార్డు వినియోగించకపోతే.. కార్డు జారీ సంస్థలు ముందుగా పలు మార్లు నోటీసులు పంపిస్తాయి. యాక్టివ్ స్టేటస్‌లో ఎందుకు ఉంచాలనుకుంటున్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. దీర్ఘకాలం పాటు క్రెడిట్ కార్డు వాడినవారు తమ కార్డును గనక క్లోజ్ చేసినట్లయితే వారి క్రెడిట్ స్కోరుపై ప్రతి కూల ప్రభావం చూపిస్తుంది. మీరు బ్యాంకుతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ టైంకు పేమెంట్స్ చేస్తూ దీర్ఘకాలం పాటు కార్డు వినియోగిస్తే బ్యాంకులు మీ గురించి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తాయి. అలాంటి కార్డులను క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ మొత్తం క్రెడిట్ హిస్టరీ నుంచి డిలీట్ అవుతుంది.

మీ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది..

మీ క్రెడిట్ లిమిట్ అనేది మీరు ఉపయోగించే మీ అందుబాటులోని క్రెడిట్ పరిమితి నిష్పత్తి. మీరు మీ క్రెడిట్ కార్డులపై ఖర్చు చేయనప్పుడు మీ సీయూఆర్ తక్కువగా ఉంటుంది. తక్కువ క్రెడిట్ లిమిట్ మీ క్రెడిట్ స్కోరుకు మంచిది. ఎందుకంటే ఇది బాధ్యతాయుతమైన క్రెడిట్ మేనేజ్‌మెంట్‌నుసూచిస్తుంది. కానీ, క్రెడిట్ కార్డును మొత్తానికే వినియోగించకుండా ఉన్నట్లయితే.. మీకు క్రెడిట్‌ని సమర్థవంతంగా నిర్వహించగల మీ సామర్థ్యాన్ని ప్రదర్శించకపోవచ్చు. క్రెడిట్‌ను నిర్వహించడంలో అనుభవం లేకపోవడమే రుణదాతలు దీనిని వీక్షించవచ్చు. ఇది భవిష్యత్తులో రుణాలు వంటి ఇతర క్రెడిట్ ఉత్పత్తులకు ఆమోదం పొందే అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇనాక్టివిటీ ఛార్జీలు..

మీరు క్రెడిట్ కార్డును వినియోగించక పోతే.. కొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇనాక్టివిటీ ఛార్జీలు విధిస్తాయి. ఈ ఫీజు క్రెడిట్ కార్డులను రెగ్యులర్‌గా వినియోగించేందుకు ప్రోత్సహించేందుకు విధిస్తున్నట్లు సంస్థలు తెలుపుతున్నాయి. అవి వార్షికంగా కానీ, లేదా సూచించిన కాలంలో కార్డు వినియోగాన్ని అంచనా వేసి ఈ ఛార్జీలు విధిస్తాయి. మరోవైపు.. సూచించిన సమయం లో క్రెడిట్ కార్డును వినియోగించకపోతే జారీ సంస్థలు క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తాయి. ఇది మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

రివార్డ్స్, బెనిఫిట్స్ కోల్పోతాం..

క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్, ఇతర బెనిఫిట్స్ ఇస్తుంటాయి జారీ సంస్థలు. కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, ఇతర ఫెసిలిటీలు ఉంటాయి. క్రెడిట్ కార్డులను వినియోగించకపోతే ఈ రివార్డ్స్, పెర్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది.

close