Dandruff : చుండ్రుతో చింతెందుకు.. ఒక్క వాష్ లోనే సులభంగా వదిలించుకోండిలా
చుండ్రు (Dandruff) మనలో చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి. అందులోనూ ప్రస్తుత చలికాలంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. చుండ్రు కారణంగా తలలో తీవ్రమైన దురద ఉంటుంది.
జుట్టు డ్రై అయిపోతుంది. హెయిర్ ఫాల్ రెట్టింపు అవుతుంది. అందుకే చుండ్రు అంటేనే చిరాకు పడుతుంటారు. చుండ్రును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు. కానీ, చుండ్రుతో చెంతే అక్కర్లేదు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే సులభంగా చుండ్రును వదిలించుకోవచ్చు. మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకును ( Aloe vera leaf )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, మూడు తుంచిన బిర్యానీ ఆకులు, మూడు రెబ్బలు కరివేపాకు ( Curry leaves )వేసి మూత పెట్టి ఉడికించాలి. దాదాపు పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి..
ఈ వాటర్ కాస్త చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె ( Mustard oil )కలిపి ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి. ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న వాటర్ ను రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోవాలి. గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. ఈ సింపుల్ రెమెడీతో ఆల్మోస్ట్ ఒక్క వాష్ లోనే చుండ్రు మొత్తం తొలగిపోతుంది.. ఇంకా మీకు చుండ్రు కనుక ఉన్నట్లు అనిపిస్తే రెండు మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి. చుండ్రు సమస్యకు పూర్తిగా బై బై చెప్పవచ్చు. ఈ మ్యాజికల్ వాటర్ చుండ్రును నివారించి స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది. హెల్తీగా, తేమగా మారుస్తుంది. మరియు ఈ మ్యాజికల్ వాటర్ హెయిర్ ఫాల్ సమస్యను సైతం కంట్రోల్ చేస్తుంది. జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.