Dental Health -
డెంటల్ స్కేలింగ్ చేయించుకుంటున్నారా?
మనిషి ఆరోగ్యాన్ని నిర్దేశించేది నోటి ఆరోగ్యమే. నోరు ఆరోగ్యంగా ఉంటే ఇతర శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకు దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ప్రధానం.
కానీ చాలామంది దీనిపై శ్రద్ధ చూపించరు. దీనివల్ల దంతాలు పాడైపోతుంటాయి. పళ్లు ఊడిపోవడం, పుచ్చిపోవడంతోపాటు ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటారు. వీటిని నివారించాలంటే డెంటల్ స్కేలింగ్ చేయించుకోవాలి. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇలా చేయించుకోవడంవల్ల నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం మన సొంతమవుతుంది.
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా డెంటల్ స్కేలింగ్ చేయించుకుంటుండాలి. ఇలా చేయడంవల్ల దంతాల నుంచి ఫలకం, టార్టార్ తొలగిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ స్కేలింగ్ చేయించుకోవాలి. పళ్ల మీద పేరుకుపోయే బ్యాక్టీరియా గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. ఈ టార్టార్ దంతాలలో అనేక వ్యాధులను కలిగిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు స్కేలింగ్ చేయించుకోవాలి. చిగుళ్ల వ్యాధి నివారణ ఫలకం, టార్టార్ చిగుళ్ల వ్యాధికి కారణమవుతాయి. చిగుళ్ల సమస్యకు సత్వరమే చికిత్సనందించకపోతే అది పీరియాంటైటిస్‌కు దారితీసి దంతాల నష్టానికి కారణమవుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్కేలింగ్ చేయించుకోవడంవల్ల చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది.
స్కేలింగ్ వల్ల దంతాలపై ఫలకం ఉండదు. కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్కేలింగ్ చేయించుకోవాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) సిఫార్సు చేసింది. చిగుళ్ల వ్యాధి రాకుండా, దంతాలు పుచ్చిపోయే ప్రమాదాన్ని తగ్గించేందుకు స్కేలింగ్ అవసరమవుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే నోటి ఆరోగ్యం.. తద్వారా అనేక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.