Dry Amla For White Hair : దీన్ని వాడితే చాలు.. మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Dry Amla For White Hair : దీన్ని వాడితే చాలు.. మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది..!

11/06/2023

 Dry Amla For White Hair : దీన్ని వాడితే చాలు.. మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారుతుంది..!


Dry Amla For White Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. పూర్వం వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ తెల్లజుట్టు నేటి తరుణంలో పిల్లల్లో కూడా కనిపిస్తుంది.
మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి వివిధ కారణాల చేత మనలో చాలా మంది తెల్లజుట్టుతో బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడం వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనిపిస్తారు. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. కానీ వీటిలో రసాయనాలు అధికంగా ఉంటాయి. దీంతో జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. కనుక మనం సహజ పద్దతుల ద్వారానే జుట్టును నల్లగా మార్చుకోవడం మంచిది.

మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చిట్కాను తయారు చేసివాడడం వల్ల చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. తెల్లజుట్టును నల్లగా మార్చే ఈ చిట్కా ఏమిటి.. దీనిని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 5 మందార ఆకులను, గుప్పెడు గోరింటాకును, ఒక గుడ్డు తెల్లసొనను, ఒక టీ స్పూన్ ఉసిరిపొడిని, 3 టీ స్పూన్ల అలోవెరా జెల్ ను, 3 టీ స్పూన్ల పెరుగును, అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పైన చెప్పిన పదార్థాలన్నింటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.

Dry Amla For White Hair

తరువాత ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


close