Garlic And Honey For Immunity : దీన్ని రోజూ ఇలా తీసుకోండి.. అంతులేని ఇమ్యూనిటీ వస్తుంది..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Garlic And Honey For Immunity : దీన్ని రోజూ ఇలా తీసుకోండి.. అంతులేని ఇమ్యూనిటీ వస్తుంది..!

11/09/2023

 Garlic And Honey For Immunity : దీన్ని రోజూ ఇలా తీసుకోండి.. అంతులేని ఇమ్యూనిటీ వస్తుంది..!

Garlic And Honey For Immunity : మనం వెల్లుల్లిని విరివిగా వంటల్లో వాడుతూ ఉంటాము. వెల్లుల్లి వేయడం వల్ల మనం చేసే వంటకాల రుచి పెరుగుతుంది. అలాగే వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మనం తేనెను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. తేనె కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మనం వెల్లుల్లి రెబ్బలను, తేనెను విడివిడిగా తీసుకుంటూ ఉంటాము. కానీ ఇలా విడివిడిగా తీసుకోవడానికి బదులుగా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి రెబ్బలను తేనెలో నెలరోజుల పాటు ఊరబెట్టి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి రెబ్బలు, తేనె మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి గానూ శుభ్రంగా తడి లేని ఒక గాజు సీసాను తీసుకోవాలి. తరువాత ఇందులో పొట్టు తీసిన శుభ్రమైన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. గాజు సీసాలో ఒక ఇంచు గ్యాప్ ఉండేలా దాని నిండా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు స్వచ్ఛమైన తేనెను పోయాలి. తరువాత గట్టిగా మూత పెట్టి ఉంచాలి.

Garlic And Honey For Immunity

ఇలా ఒక రోజంతా ఉంచిన తరువాత మూతను కొద్దిగా వదులు చేసి సీసాలో ఉండే గ్యాస్ బయటకు పోయిన తరువాత మరలా గట్టిగా మూత పెట్టాలి. ఇప్పుడు సీసాను బోర్లించి ఉంచాలి. ఇలామరుసటి మరలా మూతను వదులు చేసి గ్యాస్ పోయిన తరువాత గట్టిగా చేయాలి. ఇప్పుడు సీసాను మరలా మూత పైకి వచ్చేలా ఉంచాలి. ఇలా నెల రోజుల పాటు వెల్లుల్లి రెబ్బలను తేనెలో ఊరబెట్టాలి. నెల రోజుల తరువాత వెల్లుల్లి రెబ్బలు నల్లగా అవ్వడంతో పాటు తేనె కూడా నల్లగా అవుతుంది. ఇలా తయారు చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను, తేనెను రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి.

దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా వెల్లుల్లిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఇలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

.


close