ICC World Cup 2023: వర్షం కారణంగా సెమీ ఫైనల్ రద్దయితే.. ఫైనల్‌కు చేరుకునే జట్లు ఇవే..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

ICC World Cup 2023: వర్షం కారణంగా సెమీ ఫైనల్ రద్దయితే.. ఫైనల్‌కు చేరుకునే జట్లు ఇవే..!

11/12/2023

 ICC World Cup 2023: వర్షం కారణంగా సెమీ ఫైనల్ రద్దయితే.. ఫైనల్‌కు చేరుకునే జట్లు ఇవే..!

ICC World Cup 2023 Semi Finals: వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. రేపటితో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి.
పాయింట్ల పట్టికలో నెంబర్ టీమ్‌గా టీమిండియా, ఆ తరువాత మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిలిచాయి. ఈ నాలుగు జట్ల మధ్య సెమీ ఫైనల్ ఫైట్ ఉండనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా-ఆసీస్ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ నామమాత్రం అయినా.. పసికూన అని టీమిండియా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ టోర్నీలో పటిష్టమైన సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ జట్టు ఓడించిన విషయం తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే.. బుధవారం (నవంబర్ 15), గురువారం (నవంబర్ 16) రెండు సెమీస్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒక వేళ వర్షం కారణంగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే.. ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారు..? నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..

సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. రిజర్వే డే రోజు నిర్వహిస్తారు. ఒక రిజర్వ్ డే రోజు కూడా వర్షం వల్ల రద్దయితే.. ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారనేది ప్రశ్నగా మారింది. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా-న్యూజిలాండ్ సెమీస్ పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తే.. భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఖాయం. పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన పోరులో వర్షం కారణంగా మ్యాచ్ జరగపోతే.. సౌతాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా సఫారీ టీమ్ రెండో స్థానంలో ఉంది.

నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..
==> 1వ సెమీ ఫైనల్-భారత్ vs న్యూజిలాండ్ -15 నవంబర్ - వాంఖడే స్టేడియం (ముంబై) 

==> రెండో సెమీ ఫైనల్-దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా- 16 నవంబర్- ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)

==> ఫైనల్ - సెమీఫైనల్-1 (విజేత జట్టు) vs సెమీఫైనల్-2 (విజేత జట్టు)- 19 నవంబర్-నరేంద్ర మోడీ స్టేడియం (అహ్మదాబాద్)


close