India Post Recruitment 2023: తపాలా శాఖలో 1,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

India Post Recruitment 2023: తపాలా శాఖలో 1,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

11/08/2023

 India Post Recruitment 2023: తపాలా శాఖలో 1,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 1899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు, సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు, పోస్ట్‌మ్యాన్ 585 పోస్టులు, మెయిల్ గార్డ్ 3 పోస్టులు, ఎంటీఎస్‌ 570 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి పది, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడా విభాగంలో అర్హత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


నవోదయ దరఖాస్తు గడువు నవంబర్‌ 15 వరకు పెంపు


దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో తొమ్మిది, పదకొండో తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. ఈ మేరకు నవంబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు తుది గడువు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయా(జేఎన్‌వ)లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు భోజన, వసతి సౌకర్యాలు అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు వసతి సౌకర్యాలు కల్పిస్తారు.


టీఆర్‌టీ పరీక్ష తేదీల ఖరారు అప్పుడే..


తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల పరీక్ష (టీఆర్‌టీ)కు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాతే విద్యాశాఖ పరీక్ష తేదీలను ప్రకటించాలని భావిస్తోంది. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్‌ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని మొదట ప్రకటించినా ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా పరీక్షల తేదీలను మాత్రం వెల్లడించలేదు. మొత్తం 5,089 ఖాళీల భర్తీకి సుమారు 1.78 లక్షల దరఖాస్తులు విద్యాశాఖకు అందిన సంగతి తెలిసిందే.

close