Jee Main 2024 Registration: Start of Jee Main 2024 application process, how to apply - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Jee Main 2024 Registration: Start of Jee Main 2024 application process, how to apply

11/02/2023

Jee Main 2024 Registration: Start of Jee Main 2024 application process, how to apply

Jee Main 2024 Registration: జీ మెయిన్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఎలా అప్లై చేయాలి.

Jee Main 2024 Registration: Start of Jee Main 2024 application process, how to apply

Jee Main 2024 Registration: దేశంలోని దిగ్గజ సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో అడ్మిషన్లకై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతియేటా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ రెండు పరీక్షలు నిర్వహిస్తుంటుంది. 2024లో నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్ష ఎప్పుడుంటుంది, ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడనే వివరాలు తెలుసుకుందాం. 

జేఈఈ మెయిన్స్ 2024 రిజిస్ఠ్రేషన్ ప్రక్రియ ఇవాళ మొదలైందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ప్రకటించింది. నవంబర్ 2 నుంచి జేఈఈ మెయిన్స్ 2024కు సిద్ధమయ్యే అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇవాళ్టి నుంచి నెలరోజుల్లోగా విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేసి హోం పేజీలో కన్పించే JEE Main 2024 Session 1 Registration లింక్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఎక్కౌంట్‌లో లాగిన్ అయిన తరువాత సంబంధిత దరఖాస్తు నింపాలి. అప్లికేషన్ ఫీజు డిజిటల్ విధానంలో చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. భవిష్యత్తులో కమ్యూనికేషన్ ఇతర కారణాల కోసం సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్ 2024 మొదటి సెషన్ పరీక్ష 2024లో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతుంది. ఆ తరువాత రెండవ సెషన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలు ఏ విధమైన వయో పరిమితి లేదని ఎన్టీఏ వెల్లడించింది. ఇంటర్మీడియ్ లేదా క్లాస్ 12 ఉత్తీర్ణత సాధిస్తే చాలు.

ఈసారి జేఈఈ మెయిన్స్ 2024 పరీక్ష సిలబస్‌లో కొద్దిగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. కుదించిన సిలబస్ వివరాలను ఎన్టీఏ త్వరలో అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ప్రకటిస్తుంది. నీట్ యూజి 2024లో కూడా కొంత సిలబస్ తొలగించారు. అదే విధంగా జేఈఈ మెయిన్స్ 2024 కు కూడా సిలబస్ మార్పులు ఉండవచ్చు. ఇక ప్రశ్నాపత్రం మోడల్‌లో ఏ మార్పులుండవు. మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్నల్ ఛాయిస్‌తో ప్రశ్నలుంటాయి. ఒక్కొక్క పేపర్‌లో రెండు సెక్షన్లలో 30 ప్రశ్నలిస్తారు.ప్రశ్మాపత్రం గత ఏడాది ఉన్నట్టే ఉంటుందని ఎన్టీఏ తెలిపింది.

Important Links:

FOR   NOTIFICATION  CLICKHERE.

FOR  APPLY CLICKHERE.

close