Jeevan Pramaan Life Certificate జీవన్ ప్రమాణ్ పత్ర- డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, సులభంగా డౌన్​లోడ్ చేసుకోండిలా! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Jeevan Pramaan Life Certificate జీవన్ ప్రమాణ్ పత్ర- డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, సులభంగా డౌన్​లోడ్ చేసుకోండిలా!

11/11/2023

 Jeevan Pramaan Life Certificate Download : ప్రతి పెన్షన్ దారునికి జీవిత ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యం. వారికి వచ్చే ప్రయోజనాలు పొందాలంటే దానిని ప్రతి ఏటా సమర్పించాల్సి ఉంటుంది.

అయితే.. ఇప్పుడు ఆ ధ్రువీకరణ పత్రాన్ని మీ ఇంట్లోనే ఉండి ఆన్​లైన్ లో సులభంగా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.


Jeevan Pramaan Life Certificate Download : అర్హులైన వారికి ప్రతి నెలా పెన్షన్ రావాలంటే వారు జీవిత ధ్రువీకరణ పత్రాన్ని ఏటా సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారు జీవించే ఉన్నారని చెప్పేందుకు రుజువు. దీన్ని 'జీవన్ ప్రమాణ్ పత్ర' అని అంటారు. సంబంధిత కార్యాలయంలో ప్రతి సంవత్సరం దీన్ని సమర్పించినప్పుడే వారికి రావాల్సిన ప్రయోజనాలు అందుతాయి. ప్రతి సంవత్సరం అర్హులు నవంబరులో ఈ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.


Life Certificate For Pensioners Download : మన దేశంలో దాదాపు 70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. సాధారణంగా 80 లేదా అంతకంటే ఎక్కువ వయసు పైబడిన వారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. వీరంతా బ్యాంకులు లేదా ఇతర ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీంతో వారు పలు ఇబ్బందులు పడేవాళ్లు. ఈ సమస్యలు లేకుండా ఈ ప్రక్రియ అంతా ఆన్​లైన్​లోనే జరిగేందుకు వీలుగా ప్రభుత్వం పలు సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మన ఇంట్లోనే ఉండి ఆన్​లైన్​లోనే ఆ సర్టిఫికెట్ పొందడం, సమర్పించడం లాంటివి చేయవచ్చు.


Life Certificate Submission Date : సాధారణంగా ఈ పత్రాల సమర్పణ గడువు అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు ఉంది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పత్రాలు సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ వినియోగంపై ఇప్పటికే అవగాహన కల్పించింది. అయితే.. పెన్షనర్లు తమ దగ్గర్లోని బ్యాంకును వ్యక్తిగతంగా సందర్శించడం, డోర్‌స్టెప్ సేవలను ఉపయోగించడం లేదా వారి లైఫ్ సర్టిఫికేట్‌ను సులభంగా ఆన్‌లైన్‌లో సమర్పించడం వంటివి ఎంచుకోవడానికి వెసులుబాటు ఉంది. అంతేకాకుండా.. ఈ జీవిత ధ్రువపత్రం డిజిటల్ కాపీని PDF ఫార్మాట్‌లో వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. పెన్షనర్లు www.jeevanpramaan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత అందులో లాగిన్ అయి పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ డిజిటల్ కాపీని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం.


ముందుగా జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్ సైట్ www.jeevanpramaan.gov.in ని సందర్శించాలి.

తర్వాత తగిన వివరాలు నమోదు చేసి వెబ్​సైట్​లో లాగిన్ అవ్వాలి.

లాగిన్ అవ్వడానికి మీ జీవన్ ప్రమాణ్ IDని ఎంటర్ చెయ్యాలి.

ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబరుకి ఒక వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.

పాస్​వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

close