Good news for candidates who are interested in joining Indian Army. A B.Tech qualification gives a great opportunity to serve in the Army. Engineering graduates as well as final year students
ట్రైనింగ్ :
కోర్సులోకి సెలక్ట్ అయినవారు ఇండియన్ మిలటరీ అకాడమీ, డ్రెహ్రాడూన్ లో జులై 2024 నుంచి సుమారు ఏడాది పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రతినెలా రూ. 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్ 10 రూ. 56, 100వేతనంతో రూ. 15,500 మిలటరీ సర్వీస్ పే అందుతుంది. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. తర్వాత తొలి నెల నుంచి లక్షకు పైగా జీతం ఉంటుంది.
ఖాళీల సంఖ్య 30
సివిల్ పరిధిలో 7
కంప్యూటర్ సైన్స్ 7
ఎలక్ట్రికల్ అనుబంధ విభాగాల్లో 3
ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగాల్లో 4
మెకానికల్ 7
ఇతర విభాగాల్లో 2
అర్హత:
అనుబంధ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్, ఐటీ వంటి విద్యార్హతలతోనూ ఛాన్స్ ఉంది. అన్ని ఖాళీలు కూడా అవివాహిత పురుషులే అర్హులు
వయస్సు
జులై 1,2024 నాటికి 20 నుంచి 27ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు.
అక్టోబర్ 26 మధ్యాహ్నం 3 వరకు దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in