Joint Entrance Examination ( Main ) - 2024 - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Joint Entrance Examination ( Main ) - 2024

11/02/2023

 Joint Entrance Examination ( Main ) - 2024 

JEE Main 2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్‌-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్‌ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 


ప్రకటన వివరాలు:


జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024


అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2022, 2023లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2024 పరీక్షకు హాజరు కావచ్చు.


* తొలి విడతను వచ్చే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, చివరి విడత ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుతామని ఎన్‌టీఏ వెల్లడించింది. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్‌, బీ-ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2, మిగిలిన రోజుల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో ప్రకటిస్తారు.


* హాల్‌టికెట్లను జనవరి మూడో వారంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్‌లో జరిగే చివరి విడతకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు..


దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.


ఇంటర్‌ మార్కుల నిబంధన


గతంలో కనీస మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులైతే చాలు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించారు. ఈసారి మళ్లీ మార్కుల నిబంధనను విధించారు. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంటర్‌లో మాత్రం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65శాతం, మిగిలినవారికి 75 మార్కులు తప్పనిసరిగా రావాలని ఎన్‌టీఏ స్పష్టంచేసింది.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు


తెలంగాణ: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌.


ఏపీ: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పరే, ప్రొద్దటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


ముఖ్యాంశాలివీ..


* పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషాల్లో నిర్వహిస్తారు. ఇతర భాషల్లో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలోనూ ఇస్తారు. పేపర్‌-1 300 మార్కులకు, పేపర్‌-2 400 మార్కులకు ఉంటాయి.


* పరీక్షలు కంప్యూటర్‌ ఆధారంగా సాగుతాయి. బీఆర్క్‌ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ విధానంలో డ్రాయింగ్‌ పరీక్ష కూడా ఉంటుంది.


* పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. తొలి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్టు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.


* ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలోనూ తప్పు సమాధానాలకు మైనస్‌ మార్కులుంటాయి.


* దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాలే ఇవ్వాలని.. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని ఎన్‌టీఏ తెలిపింది.


* ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేయవచ్చు. 


ముఖ్య తేదీలు:


సెషన్-1: జేఈఈ (మెయిన్) - జనవరి 2024:


ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01-11-2023 నుంచి 30-11-2023 వరకు.


పరీక్ష తేదీలు: 2024, జనవరి నుంచి ఫిబ్రవరి 1 వరకు.


పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, జనవరి రెండో వారం.


ఫలితాల వెల్లడి: 12.02.2024.


సెషన్-2: జేఈఈ (మెయిన్) - ఏప్రిల్ 2024:


ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 02-02-2024 నుంచి 02-03-2024 వరకు.

పరీక్ష తేదీలు: 2024, ఏప్రిల్ 1 నుంచి 14 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, మార్చి మూడో వారం.

ఫలితాల వెల్లడి: 25.04.2024.


Important Links:-

Apply OnlineClick Here
Download  Notice
Click Here
Official WebsiteClick Here
NotificationClick Here

Thanks for reading Joint Entranc

close